- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Allu Arjun: రూటు మార్చిన అల్లు అర్జున్.. AA22 పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తాజాగా ‘పుష్ప-2’ (Pushpa-2)తో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తాజాగా ‘పుష్ప-2’ (Pushpa-2)తో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఈయన డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram)తో జతకట్టడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఇప్పటికే అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ‘జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో’ సినిమాలు రాగా.. ఈ మూడు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ క్రేజీ కాంబోలో నాల్గొవ మూవీ తెరకెక్కుతోంది. ఈ కాంబోపై ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ (Official Announcement) రాగా.. గీతా ఆర్ట్స్ (Gita Arts), హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. ‘AA22’ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ బజ్ (Interesting buzz) నెట్టింట వైరల్ అవుతోంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న AA22 కి సంబంధించిన స్క్రిప్ట్ ఖరారు అయిందని తెలుస్తోంది. ఇది మహా భారతం నేపథ్యంలో సోసియో ఫాంటసీ చిత్రంగా తెలుస్తోంది. యుద్ధ దేవుడైన కార్తికేయ భగవానుడు తన తండ్రి, శక్తిమంతుడైన శివునితో తిరిగి కలవడానికి బయలుదేరిన పురాణ ప్రయాణంగా రూపొందుతున్న దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు ఫిలిమ్ వర్గాల నుంచి సమాచారం. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారడంతో.. అల్లు అర్జున్ కూడా ఈసారి రూట్ మార్చాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
Exclusive #AA22 🌟 #AlluArjun #Trivikram #AA22 pic.twitter.com/Ynqa0PI3Ok
— Telugu Chitraalu (@TeluguChitraalu) January 27, 2025






