Renu Desai : ప్రతి ఒక్క రూపాయి ముఖ్యమైనదే.. ఇంట్రెస్టింగ్‌గా రేణు పోస్ట్

by Chukka Sudharani |

పవన్ కల్యాణ్ (Pawan kalyan)మాజీ భార్య, ఒకప్పటి హీరోయిన్ రేణు దేశాయ్(Renu Desai).. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటోంది.

Renu Desai : ప్రతి ఒక్క రూపాయి ముఖ్యమైనదే.. ఇంట్రెస్టింగ్‌గా రేణు పోస్ట్
X

దిశ, సినిమా: పవన్ కల్యాణ్ (Pawan kalyan)మాజీ భార్య, ఒకప్పటి హీరోయిన్ రేణు దేశాయ్(Renu Desai).. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటోంది. అంతే కాకుండా.. తన కొడుకు, కూతురుతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసుకుంటూ అభిమానులకు అందుబాటులో ఉంటోంది. దీంతో పాటు.. రేణు దేశాయ్‌కు మూగ జీవాలంటే ఎంతో ఇష్టం. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో ఆమె ప్రూవ్ చేసుకున్నారు. మూగజీవాలకు రక్షించండి.. వాటికి సహాయంగా ఉండండి అంటూ చాలా సార్లు పోస్ట్ పెట్టింది. ఇందులో భాంగంగా.. చాలా మంది రేణు దేశాయ్‌కు సపోర్ట్‌గా నిలుస్తు తోచినంత సహాయం చేస్తు్న్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో పోస్ట్ పెట్టింది రేణు. ఈ మేరకు ‘మీ అందరి మద్దతుకు ధన్యవాదాలు. నా అనుచరులలో 500 మంది 100₹ చొప్పున వేసిన కూడా మంచి జరుగుతోంది. అమాయక అండ్ గొంతు లేని జంతువులకు సహాయం చేయడానికి ప్రతి ఒక్క రూపాయి ముఖ్యమైనది’ అంటూ పోస్ట్ పెట్టింది.

Next Story