ఫైనల్లీ అందరూ లవ్‌లో పడ్డారు.. ‘సివరపల్లి’ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Gantepaka Srikanth |   (  Updated:2025-03-05 12:36:21  IST  )

ఎలాంటి అంచనాలు లేకుండా సెలైంట్‌గా ఓటీటీలో విడుదలైన సివరపల్లి వెబ్‌ సిరీస్ తెలుగు ప్రేక్షలందరి మనసులు కొల్లగొట్టింది.

ఫైనల్లీ అందరూ లవ్‌లో పడ్డారు.. ‘సివరపల్లి’ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎలాంటి అంచనాలు లేకుండా సెలైంట్‌గా ఓటీటీలో విడుదలైన సివరపల్లి వెబ్‌ సిరీస్(Sivarapalli Web Series) తెలుగు ప్రేక్షలందరి మనసులు కొల్లగొట్టింది. అచ్చమైన గ్రామీణ నేపథ్యంలోని సిరీస్ కావడంతో అందరినీ ఆకట్టుకున్నది. ముఖ్యంగా తెలంగాణలోని కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం సివరపల్లి విలేజ్ కావడంతో మరింత ప్రేక్షకాదరణ పెరిగింది. తాజాగా ఈ సిరీస్‌పై హీరోయిన్ పావని కరణం(Pavani Karanam) సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టారు. ‘కొన్ని వారాలుగా సివరపల్లి వెబ్ సిరీస్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఫైనల్‌గా మా సివరపల్లితో అందరూ లవ్‌లో పడ్డారు’ అని పేర్కొన్నది. దీంతో నెక్ట్స్ ఎపిసోడ్ ఎప్పుడు, కంటినేషన్ ఉంటుందా? అని అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఈ ‘సివరపల్లి’ (Sivarapalli) సిరీస్‌లో రాగ్‌ మయూర్‌(Rag Mayur) కీలకపాత్ర పోషించారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో(Amazon Prime Video) వేదికగా జనవరి 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అవుతున్నది. ఇందులో శ్యామ్‌ అనే యువకుడి పాత్రలో రాగ్‌ మయూర్‌ కనిపించారు. ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన శ్యామ్‌.. తెలంగాణలో మారుమూల గ్రామమైన సివరపల్లిలో ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. నిజాయతీగా పని చేయాలనుకున్న శ్యామ్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని ఎలా అధిగమించాడు? అన్న ఆసక్తికర, కథ, కథనాలతో ఈ సిరీస్‌ సాగింది.

Next Story