- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆత్మ కలిగిన యంత్రాల కథే ఇప్పుడు నిజం కాబోతుందా..?
‘గుప్పెడంత మనసు’ (Guppedantha Manasu)సీరియల్ ఫేమ్ జగతి అలియాస్ జ్యోతిరాయ్ (Jyothi Roy) ‘కిల్లర్’ (Killer) అనే చిత్రంతో వెండితెర ఎంట్రీకి సిద్ధం అయిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: ‘గుప్పెడంత మనసు’ (Guppedantha Manasu)సీరియల్ ఫేమ్ జగతి అలియాస్ జ్యోతిరాయ్ (Jyothi Roy) ‘కిల్లర్’ (Killer) అనే చిత్రంతో వెండితెర ఎంట్రీకి సిద్ధం అయిన విషయం తెలిసిందే. ‘శుక్ర’(Shukra), ‘మాటరాని మౌనమిది’(Matarani Mounamidi), ‘ఏ మాస్టర్ పీస్’(A Master Piece) వంటి డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టున్న డైరెక్టర్ పూర్వాజ్ (Director Purvaj) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జ్యోతి రాయ్ హీరోయిన్ కాగా.. పూర్వాజ్ హీరోగా నటిస్తున్నాడు. సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ చిత్రంలో విశాల్ రాజ్ (Vishal Raj), గౌతమ్ (Goutham) కూడా హీరోలుగా యాక్ట్ చేస్తున్నారు. ఏయు అండ్ఐ, మెర్జ్‌ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన లుక్ పోస్టర్స్ విపరీతంగా వైరల్ కాగా.. తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘ప్రాచీనమైన వైమానిక శాస్త్రంలో మానవ మేధస్సు రహస్యాలన్నీ ఆశ్చర్యం కలిగే శక్తుల మూలాలన్నీ అప్పట్లో కథలుగా చెప్పుకునే వారు.. ఆత్మ కలిగిన యంత్రాలు.. ఆ కథే ఇప్పుడు నిజం కాబోతుందా..? రైయ్.. ఒక సాధారణమైన మనిషి.. కానీ అసాధారణంగా మారబోతుందా..’ అంటూ ఓ పవర్‌ఫుల్ డైలాగ్‌తో స్టార్ట్ అయినా ఈ గ్లింప్స్‌లో జ్యోతిరాయ్‌లోకి ఓ రోబోటిక్ ఆత్మ ప్రవేశిస్తుంది.. అది ఎలాంటి అనార్థలు సృష్టిస్తుంది.. ఏం చేస్తుంది అనేది తెరపై చూడాల్సిందే.






