- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shreya Ghoshal: 'ఓ ఐటెమ్ సాంగ్ పాడినందుకు సిగ్గుపడుతున్నా..' శ్రేయా ఘోషాల్ ఘాటు వ్యాఖ్యలు
Shreya Ghoshal: సినిమా అంటే యాక్షన్, రొమాంటిక్, కామెడీ, పాటలు వంటి రకరకాల వినోదాల కలయిక.

దిశ, వెబ్ డెస్క్ : Shreya Ghoshal: సినిమా అంటే యాక్షన్, రొమాంటిక్, కామెడీ, పాటలు వంటి రకరకాల వినోదాల కలయిక. ఒక పక్కా కమర్షియల్ సినిమా అంటే అందులో అన్నీ ఉండాల్సిందే. ఆకలితో ఉన్నవాడికి విందు భోజనంలా వడ్డించాలి. అప్పుడే ప్రేక్షకులు సినిమా అనే రుచిని ఆస్వాదిస్తుంటారు. లేదంటే తిప్పి ముఖం మీద రు. ఇక మాంచి కమర్షియల్ సినిమాలో ఐటెం సాంగ్(Item song) ప్రతీ మాస్ ప్రేక్షకుడు స్పెషల్ ఫోకస్ పెడతాడు. సినిమాలో ఐటెం సాంగ్(Item song) లేదంటే పెదవి విరుస్తుంటారు. థియేటర్లలో స్పెషల్ సాంగ్ వచ్చిందంటే చాలు విజిల్స్, పేపర్లు విసిరివేయడం, గోల గోల చేస్తుంటారు.
అయితే బడా హీరోల సినిమాల్లో స్టార్ హీరోయిన్స్ స్పెషల్ సాంగ్(Special song) చేయడం చూస్తూనే ఉన్నాయి. అయితే స్టార్ సింగర్స్ కూడా స్పెషల్ సాంగ్ ఆలపిస్తూ ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా ఓ స్టార్ సింగర్ స్పెషల్ సాంగ్ పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. తాను పాడిన పాట పిల్లలను కూడా చెడగొట్టిందని చెప్పారు. ఆ పాట పాడినందుకు తనకు సిగ్గుగా ఉందన్నారు. ఆమె చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకు ఆ సింగర్ ఎవరో తెలుసుకుందామా?
ఎన్నో అద్భుతమైన పాటలు ఆలపించిన ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఆ సింగర్ ఎవరో కాదు శ్రేయా ఘోషాల్(Shreya Ghoshal). పన్నెండేళ్ల వయస్సులోనే పాటలు పాడటం ప్రారంభించి ఇప్పటి వరకు దాదాపు 25వేలకుపైగా పాటలు పాడింది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, బెంగాళీ ఇలా అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ సాంగ్స్(Super hit songs) పాడింది. ఇప్పటికీ ఇండస్ట్రీలోని టాప్ సింగర్స్ లో ఆమె ఒకరు. అంతేకాదు ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సింగర్స్ కూడా శ్రేయ ఒకరు.
ఈ స్టార్ సింగర్ కు తెలుగులోనూ భారీగానే అభిమానులు ఉన్నారు. తాజాగా శ్రేయా (Shreya Ghoshal)చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాను ఓ ఐటెం సాంగ్ పాడినందుకు సిగ్గుపడుతున్నానని చెప్పుకొచ్చింది. అగ్నిపథ్ మూవీ(Agneepath movie)లోని చికినీ చమేలీ అనే పాట పాడింది శ్రేయా. అయితే ఈ పాట పాడినందుకు తాను సిగ్గుపడుతున్నట్లు చెప్పింది. ఐటెం సాంగ్స్ లో అసభ్య పదజాలం వాడుతుంటారు. చిన్న పిల్లలు కూడా వాటికి అర్థమేంటో తెలియకుండానే పాడేస్తున్నారు. చిన్నపిల్లలు ఇలాంటి పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తున్నారు. కొంతమంది నా దగ్గరికి వచ్చిన మీ పాట చాలా బాగుంది..మీకోసం పాడుతా అంటూ ఆ పాటను పాడుతున్నారు. ఆ సమయంలో నాకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఓ ఐదేళ్ల పాప అలాంటి లిరిక్స్ పాడటం ఏమాత్రం సరికాదని శ్రేయ చెప్పుకొచ్చింది. ఈ పాట పాడుతుంటే విజిల్స్ వేయడం, పేపర్స్ విరేస్తుండటం, గోల గోలగా సందడి చేస్తుంటే నాకు సిగ్గుగా అనిపించిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.






