వెకేషన్ లో ప్రియాంక... ఘాటుగా ముద్దులు పెడుతూ !

by velandi.Saikiran |

బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రియాంక చోప్రా కు బాలీవ

వెకేషన్ లో ప్రియాంక... ఘాటుగా ముద్దులు పెడుతూ !
X

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రియాంక చోప్రా కు బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ ఉంది. అయితే ఈ అందాల తార తాజాగా 43వ పుట్టినరోజు చేసుకుంది. ఈ సందర్భంగా తన కుటుంబంతో కలిసి వెకేషన్ కు కూడా వెళ్ళింది. ఈ సందర్భంగా తన భర్తతో దిగిన హాట్ ఫోటోలను పంచుకుంది.

కుటుంబంతో కలిసి సముద్ర తీరాన ఎంజాయ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.... తన భర్త నిక్ జోనస్ కు ( Nick Jonas ) లిప్ లాక్ పెడుతూ మరి రచ్చ చేసింది. ఇటీవల.. తన భర్త పైకి ఎక్కి.. ముద్దులు పెట్టిన బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా... తాజాగా మరోసారి లిప్ కిస్ ఇచ్చి రచ్చ చేసింది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

ఇది ఇలా ఉండగా 2018 సంవత్సరంలో... తనకంటే పది సంవత్సరాలు చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకుంది ప్రియాంక చోప్రా. అంతేకాదు వీళ్లకు మల్తీ మేరీ చోప్రా జోనస్ అనే అమ్మాయి కూడా ఉంది. ఇక అటు బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆమె గ్లోబల్ స్టార్ గా కూడా మారిపోయారు. ఇటు తెలుగులో కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి.

Next Story