3Dలో రీ రిలీజ్ కాబోతున్న ఇండస్ట్రీ హిట్ మూవీ.. ట్వీట్ వైరల్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-04-30 05:38:01  IST  )

ప్రస్తుతం రీరిలీజ్(ReRelease) ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. హిట్ అండ్ ప్లాప్ అయిన సినిమాలను మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు.

3Dలో రీ రిలీజ్ కాబోతున్న ఇండస్ట్రీ హిట్ మూవీ.. ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం రీరిలీజ్(ReRelease) ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. హిట్ అండ్ ప్లాప్ అయిన సినిమాలను మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. వాటిని ప్రేక్షకులు కూడా అంతే అభిమానంగా ఆదరిస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా చిత్రాలు రీ రిలీజ్ అయ్యాయి. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటించిన ఓ మూవీ కూడా థియేటర్లలో అది కూడా 3డీ పిక్చర్స్‌లో రాబోతుంది. అయితే ఆ సినిమా మరేదో కాదండోయ్.. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’(Jagadeka Veerudu Athiloka Sundari).

దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు(Raghavendra rao) డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీలో శ్రీదేవి(Sridevi) హీరోయిన్‌గా నటించింది. ఇక అశ్విని దత్(Ashivini Dutt) నిర్మించిన ఈ చిత్రానికి ఇళయరాజా(Ilayaraja) సంగీతం అందించాడు. అయితే భారీ అంచనాల నడుమ ఈ చిత్రం 1990లో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా భారీ కలెక్షన్లను వసూలు చేసి ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

అయితే ఇంతటి విజయాన్ని సాధించిన ఈ మూవీని మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన విషయాన్ని వైజయంతి మూవీస్ అఫీషియల్‌గా ప్రకటిస్తూ.. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మే 9 వ తేదీన 2D మరియు 3D వర్షన్‌లలో రీ రిలీజ్ చేనున్నాము’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా ఓ స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మరి రీ రిలీజ్‌లో భాగంగా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ ఇంపాక్ట్‌ను చూపిస్తుందో చూడాలి.

Next Story