- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ ఐడల్ 12(Indian Idol 12) విజేత పవన్‌దీప్ రాజన్(Pawandeep Rajan)కి సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఈ ప్రమాదం యూపీలోని అమ్రోహా జిల్లాలో NH9 మీద గజ్రౌలా పోలీస్ స్టేషన్ ఏరియాలో జరిగినట్టు పోలీసులు పేర్కొన్నారు. పవన్‌దీప్ ఉత్తరాఖండ్‌లోని చంపావత్ నుంచి ఢిల్లీకి ఒక ప్రోగ్రామ్ కోసం వెళ్తుండగా.. నిద్రమత్తులో ఉన్న కారు డ్రైవర్ హైవే మీద ఆగి ఉన్న ఒక ఐచర్ క్యాన్టర్ ట్రక్కుని వెనక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో పవన్‌దీప్‌కి ఎడమ కాలు, కుడి చేతికి తీవ్ర గాయాలు కాగా.. అతనితో పాటు కారులో ఉన్న డ్రైవర్ రాహుల్ సింగ్, స్నేహితుడు అజయ్ మెహ్రాలకి కూడా సీరియస్ గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే పవన్ పరిస్థితి సీరియస్ గా ఉండటంతో ఢిల్లీకి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పవన్ ఆసుపత్రికి సంబంధించిన వీడియో ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనలో పడిపోయారు. కాగా పవన్ ఆరోగ్యం గురించి ఇంకా ఎలాంటి సమాచారం బయటికి వెలువడలేదు.






