- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండస్ట్రీలో హీరోలకే ఎక్కువ ప్రాధాన్యత.. హీరోయిన్లను తక్కువగా చూస్తారు: కృతి సనన్
తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హీరోయిన్ పాత్రలకు అస్సలు విలువ ఉండేది కాదని ఆమె చెప్పారు.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి సనన్ ఇటీవల ‘కాక్‌టయిల్-2’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలై.. ఘన విజయాన్ని సాధించడంతో పాటు అమ్మడు నటనకు ప్రశంసలు దక్కాయి. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి సనన్ ఇండస్ట్రీలో ఉన్న వివక్ష గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో కేవలం మగాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఆడవాళ్లను తక్కువగా చూస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పరిస్థితి మారుతున్నప్పటికీ, తాను కెరీర్ ప్రారంభించిన 2014 సమయంలో పరిస్థితులు చాలా ఘోరంగా ఉండేవని ఆమె అన్నారు. లిల్లీ సింగ్‌తో జరిగిన ఒక ఇంటర్వ్యూలో కృతి సనన్ తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు. తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హీరోయిన్ పాత్రలకు అస్సలు విలువ ఉండేది కాదని ఆమె చెప్పారు. ఆ క్యారెక్టర్ ఏం చేస్తుంది, ఎక్కడి నుండి వచ్చింది, ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అనే విషయాలను అస్సలు పట్టించుకునేవారు కాదని అన్నారు.
కేవలం హీరో పక్కన లవ్ ఇంట్రెస్ట్ కోసం మాత్రమే హీరోయిన్‌ను పెట్టేవారని తెలిపారు. ఇప్పుడు మహిళా నటులు మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటున్నారు కానీ, ఇప్పటికీ చాలా సినిమాలు హీరోల చుట్టూనే తిరుగుతాయని ఆమె అభిప్రాయపడ్డారు. సెట్స్‌లో హీరో, హీరోయిన్లను చూసే విధానంలో చాలా తేడా ఉంటుందని కృతి వెల్లడించారు. తాను యాక్టింగ్ నేర్చుకోకుండా ఇండస్ట్రీకి రావడం వల్ల సెట్స్‌లో డైరెక్టర్‌ను ఎక్కువ ప్రశ్నలు అడుగుతుండేదాన్నని చెప్పారు. అయితే తాను ఏదైనా సలహా ఇస్తే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అని అనేవారని, అదే సలహా ఒక హీరో ఇస్తే మాత్రం అవును అలాగే చేద్దాం అని ఒప్పుకునేవారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా ప్రమోషన్స్ సమయంలో కూడా హీరోయిన్ ఎక్కడ మాట్లాడాలి, ఏం చేయాలి అనేది హీరోలే డిసైడ్ చేయడం తనకు నచ్చలేదని, దాంతో కొన్ని ప్రమోషన్ల నుండి తానే తప్పుకున్నానని కూడా వెల్లడించారు. తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే ఎప్పటికప్పుడు గట్టిగా ఎదురుతిరుగుతానని కృతి స్పష్టం చేశారు.






