- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జానీ విషయంలో చెప్పింది ఒకటి.. చేసింది మరోటి: మార్తాండ్ కే వెంకటేష్
మార్తాండ్ కే వెంకటేష్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ నాకు జూనీ కథ చెప్పినప్పుడు అందులో అమ్మ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉండేది. కానీ సినిమా చూసినప్పుడు ఆ పాత్ర అసలు కనిపించలేదని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ ఎడిటర్ అయిన మార్తాండ్ కే వెంకటేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని, పవన్ కళ్యాణ్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన జానీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మార్తాండ్ కే వెంకటేష్ మాట్లాడుతూ... “జానీ సినిమా చాలా పెద్ద విజయం సాధిస్తుందని అనుకున్నాను. పవన్ కళ్యాణ్ నాకు కథ చెప్పినప్పుడు అందులో అమ్మ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉండేది. కానీ సినిమా చూసినప్పుడు ఆ పాత్ర అసలు కనిపించలేదు. అది చూసి నేను షాక్ అయ్యాను.
ఆ పాత్రను అలాగే ఉంచి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేదని నా అభిప్రాయం” అని అన్నారు. అలాగే, “ఆ సినిమాకు నేను పని చేయలేదు. కాబట్టి అంతకుమించి మాట్లాడటం మంచిది కాదు” అని కూడా పేర్కొన్నారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘జానీ’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే తాజాగా మార్తాండ్ కే వెంకటేష్ చేసిన వ్యాఖ్యలతో సినిమాలో అమ్మ పాత్ర ఉంది ఉంటే ఫలితం వేరేగా ఉండేదేమో అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.






