స్టార్టింగ్‌లో డైరెక్టర్స్ నన్ను అలా చేసుకోమని చెప్పేవారు.. అందుకే చాలా అవకాశాలు కోల్పోయాను.. తాప్సీ

by Gugulothu.Kavitha |

‘ఝమ్మంది నాదం’(Jummandi Nadam) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ తాప్సీ(Tapsi) మనందరికీ సుపరిచితమే. ఫస్ట్ మూవీతోనే మంచి విజయం సాధించింది.

స్టార్టింగ్‌లో డైరెక్టర్స్ నన్ను అలా చేసుకోమని చెప్పేవారు.. అందుకే చాలా అవకాశాలు కోల్పోయాను.. తాప్సీ
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఝమ్మంది నాదం’(Jummandi Nadam) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ తాప్సీ(Tapsi) మనందరికీ సుపరిచితమే. ఫస్ట్ మూవీతోనే మంచి విజయం సాధించింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. అలా అప్పట్లో ఓ రేంజ్‌కి ఎదిగిన ఈ చిన్నది ప్రజెంట్ టాలీవుడ్‌లో అంతగా సినిమాలు చేయడం లేదు. మరి దీనికి కావడం అవకాశాలు రాకపోవడమో, మరేదేమైనా కారణమా అనేది తెలియదు. ఇక ఈ చిన్నదాని పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే మథియాస్ బో(Mathias boe) అనే బ్యాడ్మింటన్ ప్లేయర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌కి షిఫ్ట్ అయ్యి.. అక్కడ వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ తన హెయిర్ వల్ల చాలా అవకాశాలు కోల్పోయానని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘కెరీర్ తొలినాళ్లలో ప్రతి దర్శకుడు నా జుట్టు స్ట్రెయిట్ చేయించుకోమని అడిగేవారు. చాలాకాలం వరకు దర్శకులు గ్లామర్, స్టైలీష్ లుక్ అంటే కేవలం స్ట్రెయిట్ హెయిర్ మాత్రమే అనే ఆలోచనలో ఉన్నారు. రింగుల జుట్టు అంటే కేవలం రెబల్ రూల్స్ అని భావించారు. అందుకే రింగుల జుట్టు ఉన్న అమ్మాయి పాజిటివ్ పాత్రలకు పనికిరాదని భావించేవారు.

కెరీర్ మొదట్లో నా హెయిర్ స్ట్రెయిట్ చేయించుకోవడానికి అంగీకరించాను. కానీ తర్వాత సినిమాలే కాకుండా బ్రాండ్ యాడ్స్ సంస్థలు సైతం నా జుట్టు స్ట్రెయిట్ చేయించుకోవాలని చెప్పడం నచ్చలేదు. నాకు యాడ్ చేయడానికి చాలా పెద్ద బ్రాండ్స్ ఆసక్తి చూపించాయి.. కానీ రింగుల జుట్టు కాకుండా స్ట్రెయిట్ హెయిర్ కావాలంటే నేను రిజెక్ట్ చేశాను. అందమైన జుట్టు అంటే రింగుల జుట్టు కాదనే వారి ఆలోచన నన్ను తీవ్రంగా నిరాశ పరిచాయి. చిన్నప్పుడు సైతం నేను నా జుట్టును అసహ్యించుకున్నాను.. కానీ ఆ తర్వాత నా జుట్టుపై కేర్ తీసుకున్నాను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Next Story