- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలీవుడ్‌లో ఒకరినొకరు తొక్కేయడమే తెలుసు.. టాలీవుడ్‌పై ప్రశంసలు కురిపించిన రకుల్ ప్రీత్‌సింగ్
తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల మధ్య ఉన్న తేడాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై తన నటనతో చెరగని ముద్ర వేసుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి టాప్ హీరోయిన్‌గా నిలిచిన ఈ భామ, కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే బాలీవుడ్‌కు చెక్కేసింది. ప్రస్తుతం హిందీలో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రకుల్, ఇటీవల వచ్చిన ‘పతి పత్నీ ఔర్ వో దో’ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఆమె ‘రామాయణ పార్ట్-2’, ‘నాగిల్లా’ వంటి భారీ సినిమాల షూటింగ్స్‌తో ఫుల్ బిజీగా గడుపుతోందిఅయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన రకుల్.. తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల మధ్య ఉన్న తేడాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ పద్ధతులు చాలా బాగుంటాయని చెప్తూ మన తెలుగు ఇండస్ట్రీపై ప్రశంసలు కురిపించింది. బాలీవుడ్ పరిశ్రమతో పోలిస్తే తెలుగు సినీ పరిశ్రమ ఎంతో సహాయకారిగా, ఐక్యంగా ఉంటుందని రకుల్ చెప్పింది.
బాలీవుడ్‌లో నటీనటుల మధ్య అభద్రతాభావం , అసూయ ఎక్కువగా ఉంటాయని.. అందుకే అక్కడ ఒకరి సినిమాలకు మరొకరు మద్దతు ఇవ్వరని ఆమె అభిప్రాయపడింది. అంతేకాకుండా, ఒకరి సినిమాలపై మరొకరు నెగిటివ్ ప్రచారం కూడా చేసుకుంటారని ఒకరినొకరు తొక్కేయడమే అక్కడివాళ్లకి తెలుసని రకుల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. కానీ, మన తెలుగు ఇండస్ట్రీలో మాత్రం వాతావరణం చాలా భిన్నంగా ఉంటుందని చెప్పిందిటాలీవుడ్‌లో ప్రతి ఒక్కరూ వేరే హీరోల ట్రైలర్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రమోట్ చేస్తారని, ఒకరి విజయాలను మరొకరు మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తారని రకుల్ గుర్తుచేసింది. ఇక్కడ అందరూ కలిసికట్టుగా ఉంటారని ప్రశంసించింది. ఒకవేళ బాలీవుడ్ కూడా తెలుగు ఇండస్ట్రీ లాంటి ఐక్యతను, మంచి గుణాన్ని అలవర్చుకుంటే.. మన దేశంలోనే మన సినిమా పరిశ్రమ అత్యంత బలమైనదిగా మారుతుందని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది.






