చాలా షేడ్స్‌‌ నిండిన ఈ ప్రపంచంలో డేర్ చేయాల్సిందే.. యంగ్ బ్యూటీ ట్వీట్

by Hamsa |   ( Updated:2024-12-06 13:17:14.0  )
చాలా షేడ్స్‌‌ నిండిన ఈ ప్రపంచంలో డేర్ చేయాల్సిందే.. యంగ్ బ్యూటీ  ట్వీట్
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ నభా నటేష్(Nabha Natesh) ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించి కమర్షియల్ హీరోయిన్‌గా పేరు తెచుకుంది. రామ్ పోతినేని(Ram Pothineni) సరసన ‘ఇస్మార్ట్ శంకర్’(iSmart Shankar) మూవీలో నటించి బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల ‘డార్లింగ్’(Darling) అనే వెబ్ కంటెంట్‌తో ప్రేక్షకులను అలరించింది. ప్రజెంట్ ఈ అమ్మడు నిఖిల్ సరసన ‘స్వయంభు’(Swayambhu) చిత్రంలో నటిస్తుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక నభా నటేష్ సోషల్ మీడియాలో(Social Media) యాక్టివ్‌గా ఉంటూ పలు హాట్ ఫొటోలు షేర్ చేస్తోంది. తాజాగా, రెడ్ కలర్ డ్రెస్(Red color dress) ధరించి థైయ్స్ చూపిస్తూ కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తుంది. ఈ ఫొటోలకు ఆమె ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌ను జత చేసింది. ‘‘చాలా షేడ్స్‌తో నిండి ఉన్న ఈ ప్రపంచంలో డేర్ చేయాలి’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం నభా నటేష్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అవి చూసిన నెటిజన్లు ఎర్ర గులాబీలు ఉన్నావని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఏదైనా జరిగిందా? అందుకే అలాంటి క్యాప్షన్ పెట్టిందా? అని అనుమానపడుతున్నారు.

Advertisement

Next Story