- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిర్మాతగా స్టార్ హీరో తల్లి.. ఆకట్టుకుంటోన్న ‘కొత్తలవాడి’ టీజర్
రాకింగ్ స్టార్ యష్ (Yash) అమ్మ శ్రీమతి పుష్ప అరుణ్‌కుమార్ (Pushpa Arunkumar) ఇప్పుడు నిర్మాతగా మారారు.

దిశ, సినిమా: రాకింగ్ స్టార్ యష్ (Yash) అమ్మ శ్రీమతి పుష్ప అరుణ్‌కుమార్ (Pushpa Arunkumar) ఇప్పుడు నిర్మాతగా మారారు. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటానికి ఆమె PA ప్రొడక్షన్స్ పేరుతో చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ఆమె నిర్మాతగా రూపొందించిన తొలి చిత్రం ‘కొత్తలవాడి’. టాలెంటెడ్ యాక్టర్ పృథ్వీ అంబార్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు ప్రామిసింగ్ ఫిల్మ్ మేకర్ సిరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్(First look poster)కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ చిత్రం నుంచి టీజర్ (Teaser) విడుదల చేశారు. టీజర్‌ను గమనిస్తే.. సినిమా పాత్రల్లోని ఇన్‌టెన్సిటినీ తెలియజేసేలా ఓ సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేశారు. మాస్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంటోన్న ఈ టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచే విధంగా ఉంది. కాగా.. ఈ చిత్రంలో గోపాల్ దేశ్‌పాండే, రాజేష్ నటరంగ, అవినాష్, కావ్య శైవ, మన్షి సుధీర్, రఘు రమణ కొప్ప, చేతన్ గంధర్వ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.






