Retro Teaser: రొమాన్స్ అండ్ యాక్షన్‌తో ఆకట్టుకుంటున్న రెట్రో తెలుగు టీజర్.. వీడియో

by I. Sairam |   (  Updated:2025-07-28 16:16:12  IST  )

తమిళ స్టార్ హీరో సూర్య(Surya) భాషతో సంబంధం లేకుండా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంటున్నాడు.

Retro Teaser: రొమాన్స్ అండ్ యాక్షన్‌తో ఆకట్టుకుంటున్న రెట్రో తెలుగు టీజర్.. వీడియో
X

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో సూర్య(Surya) భాషతో సంబంధం లేకుండా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంటున్నాడు. కేవలం డబ్బింగ్ చిత్రాలతోనే తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే రీసెంట్‌గా ‘కంగువా’(Kanguva) సినిమాతో ఓకే ఓకే అనిపించుకున్న సూర్య.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అందులో ‘రెట్రో’(Retro) ఒకటి. దీనికి ‘జిగ‌ర్తాండ’ ఫేమ్ కార్తిక్ సుబ్బ‌రాజ్ (Karthik Subbaraj) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అయితే సూర్య సరసన పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తుండగా.. సంతోష్ నారాయణ(Santhosh Narayana) సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 1న రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ నేప‌థ్యంలో తాజాగా శ‌నివారం ఈ మూవీ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక టీజర్‌ను గమనించినట్లయితే.. ‘హీరో, హీరోయిన్ గుడి బయట మెట్లపై కూర్చొని ఉండగా లోపల నుంచి దేవుని సాంగ్స్ వినిపిస్తుంటాయి. అప్పుడు పూజ సూర్య చేతికి ఓ తాయత్తు కడుతుండగా సూర్య.. కోపం తగ్గించుకుంటాను, మా నాన్న దగ్గర పని చేయడం ఈరోజుతో ఆపేస్తాను.

తగాదాలు, రక్తపాతం, రౌడీజం అన్నింటిని ఈ క్షణం నుంచి మానేస్తాను. నవ్వుతూ సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తాను అంటూ స్టార్ట్ అయి.. నేను పుట్టిన పర్పస్ నీ భాషలో చెప్పాలంటే నా దమం, ఇక ప్రేమ, పవిత్రమైన ప్రేమ.. అది మాత్రమే.. కర్టన్ రైట్‌గా చెప్తున్నాను. ఇప్పుడు చెప్పవే మనం పెళ్లి చేసుకుందామా’ అని హీరోయిన్‌ను అడుగుతాడు. దీంతో ఈ టీజర్ అయిపోతుంది. అయితే లాస్ట్‌లో వచ్చిన రొమాంటిక్, ఎమోషనల్ బీజిఎమ్‌ మాత్రం వేరే లెవెల్ అనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం యాక్షన్ అండ్ రొమన్స్‌తో సాగిన ఈ టీజర్ యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

Click For Video..

Next Story