- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HHVM: పవన్ కల్యాణ్ అభిమానులకు ముఖ్య గమనిక
వర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న హరిహర వీరమల్లు చిత్రం(Harihara Veeramallu Movie) జులై 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కాబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న హరిహర వీరమల్లు చిత్రం(Harihara Veeramallu Movie) జులై 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. ఇటీవలే ట్రైలర్‌ను విడుదల చేసింది. విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించింది. సౌత్ ఇండియాలోనే అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాగా వీరమల్లు నిలిచింది. ఇదిలా ఉంటే.. పవన్ కల్యాణ్ అభిమానులకు విజయవాడలోని అలంకార్ థియేటర్(Alankar Theatre) యాజమాన్యం శుభవార్త చెప్పింది. ‘ఈరోజు నుంచి పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన హరిహర వీరమల్లు ట్రైలర్‌ను ప్రతీ ఆటకు ఇంటర్‌వెల్‌లో ప్రదర్శిస్తాము’ అని పేర్కొన్నారు. దీంతో థియేటర్‌లో మిస్ అయిన అభిమానులకు భారీగా థియేటర్‌కు వెళ్లే అవకశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అలంకార్ థియేటర్‌లో ధనుష్-నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన కుబేర చిత్రం నడుస్తోంది.
పవన్ కల్యాణ్ పోరాట యోధుడి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి సంయుక్తంగా దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాబి డియోల్, సునీల్, నాజర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పవన్ కల్యాణ్ కెరియర్‌లో రాబోతున్న ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావడంతో ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.
Read Mopre..






