- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోడీ జీ.. నేను నిజమైన అభిమానిని..! ప్రధానితో భేటీ సందర్భంగా ఉపాసన ఆసక్తికర ట్వీట్ వైరల్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు శనివారం ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు శనివారం (Prime Minister Modi) ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన విషయం తెలిసిందే. తొలి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) విజయవంతంగా ముగిసిన సందర్భంగా దంపతులు మోడీని కలిశారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన ఫొటోలను (Ram Charan) రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల (Upasana Konidela) స్వయంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఆదివారం ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. నేను క్రీడాకారిణి కానప్పటికీ, ఒక హెల్త్‌కేర్ రంగం నుంచి వచ్చిన వ్యక్తిగా శారీరక, మానసిక ఆరోగ్యానికి క్రీడలు ఎంత కీలకమో తనకు బాగా తెలుసని పేర్కొన్నారు. క్రీడల ద్వారా దేశాన్ని ఆరోగ్యవంతంగా మార్చాలన్న ప్రధాని మోడీ దార్శనికత త్వరలోనే నిజం అవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా నేను నిజమైన అభిమానిని మోడీజీ అంటూ పేర్కొన్నారు.
ఉపాసన తన తండ్రి, ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ కామినేని ఈ అర్చరీ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ మేరకు లీగ్ విజయవంతంపై తన తండ్రికి అభినందనలు తెలిపారు. అలాగే, ఆర్చరీ క్రీడకు తన భర్త, నటుడు రామ్‌చరణ్ బ్రాండ్ అంబాసిడర్ అని ఉపాసన కొనియాడారు. ఎక్కువ మంది ఈ క్రీడను స్వీకరించి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. ఇక, తన అత్తమామలు చిరంజీవి, సురేఖ తరపున ప్రధాని మోడీకి వెంకటేశ్వర్ల స్వామి (బాలాజీ) విగ్రహన్ని బహుకరించినట్లు ఫోటోలు పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్‌గా మారింది. మేము మీకు సపోర్ట్ చేస్తామని నెటిజన్‌లు ఆమె ట్వీట్‌కు కామెంట్ల రూపంలో మద్దతు తెలిపారు. ట్వీట్ ఇదే..






