Ileana - Rakul: ఇద్దరూ చేసిన అతిపెద్ద తప్పు అదే

by Pulgam srinivas |

Ileana - Rakul: ఈ ఇద్దరికి తెలుగులో మంచి అవకాశాలు దక్కుతున్న సమయంలోనే హిందీ సినిమాల్లో నటించాలనే ఆసక్తితో టాలీవుడ్​కు దూరం అయ్యారు. కానీ ప్రస్తుతం హిందీలో కూడా మంచి అవకాశాలను దక్కించుకోవడంలో విఫలమవుతున్నారు.

Ileana - Rakul: ఇద్దరూ చేసిన అతిపెద్ద తప్పు అదే
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా పరిశ్రమలో మంచి స్థాయికి చేరుకున్న తర్వాత కొంతమంది ఇతర ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చేతులు కాల్చుకున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఇలియానా, రకుల్ ప్రీత్ సింగ్ ముందు వరుసలో ఉంటారు. ఇలియానా 'దేవదాసు' చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యి మంచి విజయాన్ని, గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమెకు వరస పెట్టి టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కాయి.

అలాగే ఈ హీరోయిన్ నటించిన ఎన్నో సినిమాలు మంచి విజయాలను సాధించడంతో తక్కువ కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. అలా మంచి దశలో కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలోనే ఈ బ్యూటీ హిందీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అక్కడ మొదట్లో ఈమెకు మంచి అవకాశాలు వచ్చిన విజయాలు మాత్రం దక్కలేదు. దానితో మెల్లిమెల్లిగా ఇలియానాకి బాలీవుడ్లో అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఈమె చేతిలో పెద్దగా హిందీ సినిమాలు లేవు. అటు ఇటుగా రకుల్ ప్రీత్ సింగ్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఈమె వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.

మంచి అవకాశాలు దక్కుతున్న సమయంలోనే రకుల్ తెలుగు సినిమాల్లో కంటే కూడా హిందీ సినిమాల్లో నటించడంపై ఎక్కువ ఆసక్తిని చూపించడం మొదలు పెట్టింది. దానితో టాలీవుడ్ సినిమాలను పక్కన పెట్టి బాలీవుడ్ ఇండస్ట్రీపై ఇష్టాన్ని పెంచుకుంది. ఈమెకు కూడా హిందీలో మంచి అవకాశాలు దక్కుతున్నాయి. కానీ పెద్ద విజయాలు మాత్రం దక్కడం లేదు. ఇలా ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు తెలుగులో టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్న సమయంలోనే హిందీ సినిమాలపై ఆసక్తిని పెంచుకొని ఇక్కడ అవకాశాలను దూరం చేసుకుని, అక్కడ సరైన విజయాలు ఇబ్బంది పడుతున్నారు.

Next Story