- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ilaiyaraja: ఆలయంలో ఇళయరాజాకు ఘోర అవమానం.. క్లారిటీ ఇస్తూ నెట్టింట ట్వీట్
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా(Ilaiyaraja) తమిళనాడులోని శ్రీవల్లి పుత్తూరు ఆండాళ్(Srivalli Puttur Andal) ఆలయానికి వెళ్లిన సంగతి తెలిసిందే.

దిశ, సినిమా: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా(Ilaiyaraja) తమిళనాడులోని శ్రీవల్లి పుత్తూరు ఆండాళ్(Srivalli Puttur Andal) ఆలయానికి వెళ్లిన సంగతి తెలిసిందే. కానీ ఆయనను లోపలికి అనుమతించకపోవడంతో బయటనుంచే దర్శించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. ఆ ఆలయంలోని గర్భగుడి వద్దకు ఆయనను వెళ్లేందుకు ఇళయరాజా ప్రయత్నించగా అర్చకులు అనుమతిని నిరాకరించి అవమానించినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు కూడా నెట్టింట దర్శనమిచ్చాయి.
తాజాగా, ఈ వార్తలపై ఆయన ‘X’ వేదికగా స్పందించారు. ‘‘నా చుట్టూ కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. నేను ఏ సమయంలోనైనా.. ఏ ప్రదేశంలోనైనా నా ఆత్మగౌరవం విషయంలో రాజీపడే వ్యక్తిని కాదు. జరగని విషయాన్ని కూడా జరిగినట్లు ప్రచారం చేస్తున్నారు. అభిమానులు, ప్రజలు ఈ రూమర్స్ నమ్మవద్దు. నాకు ఎలాంటి అవమానం జరగలేదు’’ అని రాసుకొచ్చారు. కాగా, ఇళయరాజా సంగీతం అందించిన లేటెస్ట్ చిత్రం ‘విడుదల-2’(Viduthalai Part 2). విజయ్ సేతుపతి(Vijay Sethupathi) నటించిన ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది.
என்னை மையமாக வைத்து சிலர் பொய்யான வதந்திகளைப் பரப்பி வருகிறார்கள். நான் எந்த நேரத்திலும், எந்த இடத்திலும் என்னுடைய சுய மரியாதையை விட்டுக் கொடுப்பவன் அல்ல, விட்டுக்கொடுக்கவும் இல்லை. நடக்காத செய்தியை நடந்ததாகப் பரப்புகின்றார்கள். இந்த வதந்திகளை ரசிகர்களும், மக்களும் நம்ப வேண்டாம்.
— Ilaiyaraaja (@ilaiyaraaja) December 16, 2024






