'డ్యూడ్'కు షాకిచ్చిన ఇళయరాజా

by Muthe.Rajitha |

ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించి, సూపర్ హిట్టుతో దూసుకుపోతున్న సినిమా 'డ్యూడ్'. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

డ్యూడ్కు షాకిచ్చిన ఇళయరాజా
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించి, సూపర్ హిట్టుతో దూసుకుపోతున్న సినిమా 'డ్యూడ్'. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ సినిమాకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. లెజెండరీ మ్యూజీషియన్ ఇళయరాజా ఈ చిత్రం కాపీరైట్ ఉల్లంఘన చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూడ్ సినిమాలోని చిత్రంలో ‘కరుత్త మచ్చాన్’ సాంగ్‌ను తన అనుమతి లేకుండా ఉపయోగించారంటూ చిత్రయూనిట్‌పై ఫిర్యాదు చేశారు.

దీంతో మేకర్స్, సంగీత దర్శకులు చట్టపరమైన చిక్కులను ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సంగీత దర్శకుడు ఇళయరాజా ఇదివరకు కూడా తను కంపోజ్ చేసిన గుడ్ బ్యాడ్ అగ్లీ, కూలీ, మంజుమ్మల్ బాయ్స్, మిసెస్ & మిస్టర్ సినిమాలపై మ్యుజిక్ కాపీరైట్ కేసు వేసిన విషయం తెలిసిందే. బంపర్ హిట్టు సాధించిన ఈ చిత్రానికి ఈ వివాదం కొత్త చిక్కులు తెచ్చిపెట్టినట్టేనని సినీ పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది.

Next Story