IIFA Awards 2025: అవార్డు అందుకున్న విన్నర్స్ లిస్ట్ ఇదే..!

by Mallepaka Hamsa |   (  Updated:2025-03-09 05:11:56  IST  )

ఈ ఏడాది ఐఫా అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. అయితే ఈ కార్యక్రమాన్ని జైపూర్‌లో నిర్వహించగా...

IIFA Awards 2025: అవార్డు అందుకున్న విన్నర్స్ లిస్ట్ ఇదే..!
X

దిశ, సినిమా: ఈ ఏడాది ఐఫా అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. అయితే ఈ కార్యక్రమాన్ని జైపూర్‌లో నిర్వహించగా... ఈ వేడుకకు రాజస్థాన్ సీఎం, భజన్‌లాల్ శర్మ(Bhajanlal Sharma), డిప్యూటీ సీఎం దియా కుమారి (Diya Kumari)ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు. అలాగే పలువురు సినీ స్టార్స్ షారుఖ్ ఖాన్, కృతి సనన్(Kriti Sanon), కరణ్ జోహార్, బాబీ డియోల్, కరీనా కపూర్(Kareena Kapoor), షాహిద్ కపూర్, పాల్గొన్నారు.

ఇక ఇందులో సినీ సెలబ్రిటీలంతా ‘ది జర్నీ ఆఫ్ ఉమెన్ ఇన్ సినిమా’ పేరుతో జరిగిన చర్చలో పలు కీలక విషయాలను వెల్లడించారు. ఇందులో భాగంగా కొంతమంది హీరోయిన్స్ తమ అభిప్రాయాలను తెలిపారు. ఈ విషయంపై మాధురీ దీక్షీత్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘ఇండస్ట్రీలో మహిళలు మళ్లీ మళ్లీ టాలెంట్‌ను నిరూపించుకోవాల్సి వస్తుంది. కానీ హీరోలకు అలా కదు. రెమ్యునరేషన్ విషయంలో కూడా వ్యత్యాసం చూపిస్తున్నారు’’ అని చెప్పుకొచ్చింది. ఇక పలువురు అవార్డ్స్ అందుకున్నారు.

విన్నర్స్ లిస్ట్:

ఉత్తమ చిత్రం: అమర్ సింగ్ చమ్కిలా

ఉత్తమ నటి: కృతి సనన్

ఉత్తమ నటుడు: విక్రాంత్ మాస్సే (సెక్టార్ 36)

ప్రధాన పాత్రలో ప్రదర్శన, పురుషుడు (సినిమా): సెక్టార్ 36 కోసం విక్రాంత్ మాస్సే

ఉత్తమ దర్శకత్వం (చిత్రం): అమర్ సింగ్ చమ్కీలా చిత్రానికి ఇంతియాజ్ అలీ

ఉత్తమ సహాయ నటి: అనుప్రియా గోయెంకా (బెర్లిన్)

ఉత్తమ సహాయ నటుడు: దీపక్ డోబ్రియాల్ (సెక్టార్ 36)

ఉత్తమ కథ ఒరిజినల్ (చిత్రం): దో పట్టి చిత్రానికి కనికా ధిల్లాన్

ఉత్తమ దర్శకుడు: ఇంతియాస్ అలీ (అమర్ సింగ్ చంకిలా)

సిరీస్ విన్నర్స్:

ఉత్తమ సిరీస్: పంచాయత్ సీజన్-3

ఉత్తమ నటుడు: జితేంద్ర కుమార్

ఉత్తమ నటి: శ్రియ చౌదరి

ఉత్తమ సహాయ నటి: సంజీదా షేక్

ఉత్తమ డైరెక్టర్: దీపక్ కుమార్ మిశ్రా

ఉత్తమ సహాయ నటుడు: ఫైసల్ మాలిక్

ఉత్తమ కథ: కోటా ఫ్యాక్టరీ సీజన్-3

ఉత్తమ రియాల్టీ సిరీస్: ఫ్యాబులెస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైఫ్స్

ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్: యో యో హనీ సింగ్

Next Story