Dulquer Salmaan : నకిలీ వార్తలను విస్మరించి అధికారిక ప్రకటనల కోసం వేచి ఉండండి.. దుల్కర్ సల్మాన్ పోస్ట్ వైరల్

by Chukka Sudharani |

కళ్యాణి ప్రియదర్శన్ సూపర్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘లోకా: చాప్టర్-1 చంద్ర’.

Dulquer Salmaan : నకిలీ వార్తలను విస్మరించి అధికారిక ప్రకటనల కోసం వేచి ఉండండి.. దుల్కర్ సల్మాన్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: కళ్యాణి ప్రియదర్శి సూపర్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘లోకా: చాప్టర్-1 చంద్ర’. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని ఫలితాన్ని అందుకుంది. అన్ని భాషల్లో కలిపి ఏకంగా రూ. 250 కోట్ల వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకుంది. ఆగస్టు 28న థియేటర్స్‌లోకి వచ్చిన ‘లోకా’ చిత్రం ఇంకా కొన్ని ఏరియాల్లో థియేటర్స్‌లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. అయితే.. ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. సెప్టెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకురాబోతున్నట్లు నెట్టింట పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీనిపై తాజాగా హీరో, నిర్మాత దుల్కర్ సల్మాన్ స్పందిస్తూ.. ‘లోకా త్వరలో OTT లోకి వస్తుంది అనే వార్తలు నిజం కాదు. అప్పుడే ఓటీటీలోకి రావడం లేదు. నకిలీ వార్తలను విస్మరించి అధికారిక ప్రకటనల కోసం వేచి ఉండండి’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఓటీటీ రిలీజ్‌పై వస్తున్న వార్తలకు బ్రేక్ పడింది. కాగా.. ఈ సినిమాకు డామినిక్ దర్శకత్వం వహించగా.. దుల్కర్ సల్మాన్ నిర్మించారు. లింక్

Next Story