Renu Desai: రణ్‌వీర్ లాంటి ఇడియట్స్‌‌ను దూరం పెట్టండి.. రేణు దేశాయ్ సెన్సేషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

ఇటీవల చాలా మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు వైరల్ కావడానికి ఏది పడితే మాట్లాడేస్తున్నారు.

Renu Desai: రణ్‌వీర్ లాంటి ఇడియట్స్‌‌ను దూరం పెట్టండి.. రేణు దేశాయ్ సెన్సేషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: ఇటీవల చాలా మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు వైరల్ కావడానికి ఏది పడితే మాట్లాడేస్తున్నారు. మరికొంతమంది ఏఐతో దారుణమైన ఫొటోలు షేర్ చేసి ఫాలోవర్స్‌ను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైతేనేం సోషల్ మీడియాలో మేము కూడా సెలబ్రిటీలం అయిపోవాలని అంతా పలు స్టంట్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఇంకా కొందరు మాత్రం తమ టాలెంట్‌తో ఓవర్ నైట్ స్టార్స్‌గా మారిపోతున్నారు. తాజాగా, ఓ యూట్యూబర్ ఓ షోలో పాల్గొని దారుణమైన కామెంట్స్‌తో అందరి చేత చివాట్లు తింటున్నాడు.

అసలు విషయంలోకి వెళితే.. రణ్‌వీర్ అల్లాబాడియా(Ranveer Allahabadia) అనే యూట్యూబర్, సమయ్ రైనా, అపూర్వ ముఖిజ ‘ఇండియాస్ గాట్ లాలెంట్’(India's Got lalent) షోలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా రణ్‌వీర్ ఓ మహిళా కంటెస్టెంట్‌ను అడగకూడని ప్రశ్న అడిగాడు. ‘‘మీ తల్లిదండ్రులు సెక్స్ చేయడం జీవితాంతం చూస్తావా లేక ఒకసారి కలిసి దాన్ని శాశ్వతంగా ఆపేస్తావా? అని అడిగారు. దీంతో ఒక్కసారిగా ఈ షోలో ఉన్నవారంతా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రణ్‌వీర్, ఆ మహిళపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక ఈ వ్యాఖ్యలు సినీ రాజకీయ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రణ్‌వీర్ క్షమాపణలు చెప్పినప్పటికీ వివాదం సర్దుమనగలేదు. తాజాగా, ఈ విషయంపై రేణు దేశాయ్(Renu Desai) కూడా స్పందించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస పోస్టులు షేర్ చేసింది. ‘‘మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని. మంచిగా పెంచాలి అనుకుంటే రణ్‌వీర్ లాంటి ఇడియట్స్‌ను దూరం పెట్టంది. వారిని అన్‌ఫాలో చేయాలి. యంగ్ జనరేషన్ అంతా కూడా ఎంతో బాధ్యతగా ఉండాలి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే కేటగిరీ కింద వల్గారిటీ అనేది ఈ యూత్ యాక్సెప్ట్ చేస్తుంది’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం రేణు దేశాయ్ పోస్ట్ సోషల్ మీడియాలో సెన్సేషనల్‌గా మారింది. ఇక వాటిని చూసిన వారంతా అవును నిజమే అని రేణు దేశాయ్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

Next Story