Venkatesh-Trivikram: ఆదర్శ కుటుంబం అలాంటి సినిమా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే

by Pulgam srinivas |

వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం చిత్రం ఫ్యామిలీ ప్లస్ మాస్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

Venkatesh-Trivikram: ఆదర్శ కుటుంబం అలాంటి సినిమా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే
X

దిశ, వెబ్ డెస్క్: విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ప్రస్తుతం ఆదర్శ కుటుంబం అనే చిత్రం రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఇందులో కేజిఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. చాలా సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే వెంకటేష్ హీరోగా రూపొందిన నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి చిత్రాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించాడు.

ఈ రెండు చిత్రాలు కూడా భారీ విజయాలను అందుకున్నాయి. దానితో ప్రస్తుతం వీరి కాంబోలో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వెంకటేష్ ఎక్కువ శాతం ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలలో నటించడం, త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఇదే జోనర్ పై ఆసక్తి చూపడంతో, ఈ సినిమా టైటిల్ కూడా ఆదర్శ కుటుంబం అని ఉండడంతో చాలామంది ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా అని భావిస్తున్నారు. అలా అనుకుంటే వారు పప్పులో కాలేసినట్లే అని తెలుస్తుంది.

ఈ సినిమా టైటిల్ ఆదర్శ కుటుంబం అయినా కూడా ఇందులో కేవలం ఫస్టాఫ్ వరకు మాత్రమే కుటుంబ సన్నివేశాలు ఉండనున్నట్లు, సెకండ్ హాఫ్ లో కుటుంబ సన్నివేశాలతో పాటు భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా కథ సాగనున్నట్లు, అందులో భారీ ట్విస్టులు, మలుపులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి భారీ విజయం తర్వాత వెంకటేష్ నటిస్తున్న సినిమా కావడం, త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తూ ఉండడంతో తెలుగు ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Next Story