Allu Arjun: ధనరాజ్ పెళ్ళి రోజు అల్లు అర్జున్ ఏం చేశాడో తెలిస్తే షాకవ్వాల్సిందే..!

by Phanindra |

సముద్ర కని, ధనరాజ్ కాంబోలో తెరకెక్కిన మూవీ " రామం రాఘవం ".

Allu Arjun: ధనరాజ్ పెళ్ళి రోజు అల్లు అర్జున్ ఏం చేశాడో తెలిస్తే షాకవ్వాల్సిందే..!
X

దిశ, వెబ్ డెస్క్ : సముద్ర కని, ధనరాజ్ కాంబోలో తెరకెక్కిన మూవీ " రామం రాఘవం " ( Raamam Raaghavam ) ఈ చిత్రం ఫిబ్రవరి 21 న ప్రేక్షుకుల ముందుకు రానుంది. అయితే, ఈ క్రమంలోనే ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. అల్లు అర్జున్ తో ధనరాజ్ పరుగు మూవీలో నటించాడు. ఆ చిత్రంలో వీళ్లిద్దరి కాంబోలో చాలానే సీన్స్ చేశారు. దీంతో, అప్పటి నుంచి వీరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది.

ధనరాజ్ ( Dhanraj ) " పరుగు " చిత్ర షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను పంచుకున్నారు.. " పరుగు సమయంలో అల్లు అర్జున్ దగ్గరకు వెళ్ళి మార్చి 5న మా పెళ్లి రోజు సర్.. మీరు నా భార్య కోసం సర్ ప్రైజ్ కాల్ చేయాలని అడిగాను. అప్పుడు అలా డైరెక్ట్ గా అడగకూడదని నాకు తెలీదు. మా పెళ్లి రోజు నేను, మా ఆవిడ బట్టలు మడతబెడుతుంటే సడెన్ గా ఫోన్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేసి నేను బన్నీ ని .. నేనయ్య హీరో బన్నీని మీ వైఫ్ కి విషెష్ చెప్పాలన్నావ్ గా.. అనగానే షాక్ అయ్యా .. ఇక వెంటనే సర్ సర్ అంటూ లౌడ్ స్పీకర్ లో పెట్టి నా భార్యకు ఇచ్చా.. హ్యాపీ యానివర్సరీ, అంటూ విషెష్ చెప్పారు. అల్లు అర్జున్ పెద్ద హీరో .. ఆయన పనుల్లో ఆయన బిజీగా ఉంటారు.. అలాంటిది గుర్తుపెట్టుకుని మరీ కరెక్ట్ టైం కి కాల్ చేస్తారని అసలు అనుకోలేదని" చెప్పారు. దీంతో ధనరాజ్ మాట్లాడిన మాటలు వైరల్ అవ్వగా బన్నీ అభిమానులు కూడా "మా అన్న చేసే మంచి ఎవరికీ కనిపించదు " అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story