‘మెగా-157’లో నయన్ నటించడానికి తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరి పోవాల్సిందే..

by Gugulothu.Kavitha |

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

‘మెగా-157’లో నయన్ నటించడానికి తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరి పోవాల్సిందే..
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ‘మెగా-157’ వర్కింట్ టైటిల్‌తో రాబోతున్న ఈ యాక్షన్ కామెడీ మూవీని షైన్ స్క్రీన్ , గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, అర్యన ప్రజెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి(Sahu Garapati), చిరు పెద్ద కూతురు సుస్మిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇక ఇందులో మెగాస్టార్ శంకర వరప్రసాద్ పాత్రలో నటించనున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార నటిస్తున్నట్లు తాజాగా మూవీ టీమ్ అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా కోసం నయన్ ఏకంగా రూ.20 కోట్లు డిమాండ్ చేసిందని ప్రచారం నడిచింది. చివరకు ఈ ప్రాజెక్ట్ కోసం రూ.18 కోట్లు పారితోషికం తీసుకుంటుందని టాక్. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఈ పారితోషికం అత్యధికం. దీంతో ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరోయిన్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది నయన్. కాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

Next Story