- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పని లేకుంటే జీవితం అస్తవ్యస్తం అవుతుంది.. సోమరితనంపై షాకింగ్ కామెంట్స్ చేసిన అమితాబ్ బచ్చన్
అమితాబ్ మాట్లాడుతూ... ఎలాంటి కారణం లేకుండా ఖాళీగా ఉంటే అది తనను ఎంతో వేధిస్తుందని తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ప్రస్తుత వయస్సు 83 సంవత్సరాలు. ఈ వయస్సులో కూడా ఆయన ఏమాత్రం ఖాళీగా ఉండకుండా ఎన్నో టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ, పలు సినిమాల్లో నటిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఈ వయస్సులో కూడా కుర్ర హీరోలతో పోటీగా అమితాబ్ కష్టపడుతూ ఉండడం చూసి ఎంతోమంది ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సీనియర్ స్టార్ హీరో ఖాళీగా ఉండడం కంటే పని చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని తెలిసిందే. తాజాగా తన బ్లాగ్‌లో పని పట్ల తనకున్న ప్రేమను గురించి అమితాబ్ వివరించారు. ఎలాంటి కారణం లేకుండా ఖాళీగా ఉంటే అది తనను ఎంతో వేధిస్తుందని ఆయన తెలిపారు.
ప్రతిరోజును ఒక పద్ధతిగా, ముందుగానే రూపొందించిన షెడ్యూల్ ప్రకారం సాగించేలా ప్లాన్ చేసుకుంటానని చెప్పారు. ఆ షెడ్యూల్ తప్పితే ఆ రోజంతా తనకు ఎంతో కఠినంగా, బాధగా అనిపిస్తుందని వెల్లడించారు. అలాగే సోమరిలా ఉండడం కూడా తనకు ఎంతో కష్టంగా అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. ఇక అమితాబ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి 17వ సీజన్‌ను తాజాగా విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సీజన్ ముగిసిన సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. సినిమాల విషయానికి వస్తే... కొంతకాలం క్రితం విడుదలైన కల్కి 2898 AD చిత్రంతో ప్రేక్షకులను అలరించిన అమితాబ్, ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్‌లో కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.






