- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహేష్ కోసం ఒక్కడు రాసుంటే.. మరో సైనికుడు అయ్యేది: షాకింగ్ కామెంట్స్ చేసిన గుణశేఖర్
ఒక్కడు కథను మహేష్ కోసం రాసి ఉంటే అది మరో ‘సైనికుడు’ అయ్యేదని గుణశేఖర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న దర్శకుల్లో గుణశేఖర్ ఒకరు. తనదైన శైలిలో ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన పలువురు స్టార్ హీరోలతో కలిసి పనిచేసి మంచి విజయాలను అందుకున్నారు. గుణశేఖర్ కెరీర్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చిత్రాల్లో ‘ఒక్కడు’ ఒకటి. ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించగా, భూమిక హీరోయిన్‌గా కనిపించింది. ప్రకాష్ రాజ్ ప్రతినాయకుడి పాత్రలో అద్భుతమైన నటనతో మెప్పించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.
‘ఒక్కడు’ సినిమా మహేష్ బాబుకు మాస్ ఆడియన్స్‌లో మరింత క్రేజ్ తీసుకురాగా, దర్శకుడు గుణశేఖర్‌కు కూడా ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. అనంతరం వీరి కాంబినేషన్‌లో ‘అర్జున్’, ‘సైనికుడు’ చిత్రాలు తెరకెక్కాయి. అయితే అవి ‘ఒక్కడు’ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయి. ఇటీవల గుణశేఖర్ ‘ఒక్కడు’ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన మాట్లాడుతూ... ఒక్కడు కథను మహేష్ బాబు కోసం ప్రత్యేకంగా రాసి ఉంటే అది మరో ‘సైనికుడు’ అయ్యేదని వ్యాఖ్యానించారు. ‘సైనికుడు’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో గుణశేఖర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






