- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాగార్జున లేకుంటే ఆర్జీవీ కెరీర్ మొదటిరోజే ముగిసేది – జేడీ సంచలన వ్యాఖ్యలు
జేడీ మాట్లాడుతూ.. ‘శివ’ షూటింగ్ సమయంలో ఆర్జీవీకి, ఫైట్ మాస్టర్ రాజు మధ్య కొన్ని విభేదాలు వచ్చినట్లు తెలిపారు. అయితే ఆ సమయంలో నాగార్జున, రామ్ గోపాల్ వర్మను పూర్తిగా నమ్మారని ఈ నటుడు వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ నటులలో ఒకరైన జేడీ చక్రవర్తి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయనకు తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపును తీసుకువచ్చిన చిత్రాలలో ‘శివ’ ఒకటి. ఈ చిత్రంలో నాగార్జున హీరోగా నటించగా, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. ఇదే సినిమాతో వర్మ దర్శకుడిగా పరిచయం అయ్యారు. తాజాగా జేడీ చక్రవర్తి ‘గాయపడ్డ సింహం’ అనే చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా మే 1న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ఆయన ప్రమోషన్లలో బిజీగా పాల్గొంటూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆర్జీవీ ప్రవర్తనపై, అలాగే ‘శివ’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనపై స్పందించారు. జేడీ మాట్లాడుతూ... రామ్ గోపాల్ వర్మ చాలా ముక్కుసూటి వ్యక్తి అని, ఎవరి అభిప్రాయాలనూ పెద్దగా పట్టించుకోరని చెప్పారు. ‘శివ’ ఆయనకు తొలి సినిమా అయినప్పటికీ, ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను తెరకెక్కించారని తెలిపారు. అయితే షూటింగ్ మొదటి రోజే జరిగిన ఒక సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందని జేడీ వెల్లడించారు.
ఆ రోజు ఒక యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేయగా, టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్ రాజు మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. టైర్లు కాల్చడం, పొగ ఎఫెక్ట్స్ వంటి సీన్స్ డిజైన్ చేశారు. కానీ ఆ ఎఫెక్ట్స్ చూసిన వర్మ అవి అవసరం లేదని, తనకు ఇలాంటి ఎఫెక్ట్స్ వద్దని గట్టిగా చెప్పారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది. అయితే హీరో నాగార్జున వర్మను నమ్మి ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని జేడీ తెలిపారు. అదే నమ్మకం కారణంగా సినిమా విజయవంతమైందని, ఆ రోజున నాగార్జున నమ్మకమే లేకపోతే వర్మ కెరీర్ మొదట్లోనే ముగిసిపోయేదని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.






