- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటే బాలకృష్ణ బాబాయ్‌తో కలిసి నటిస్తాను.. కళ్యాణ్ రామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్(వీడియో)
నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’(Arjun S/O Vyjayanthi).

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’(Arjun S/O Vyjayanthi). ప్రదీప్ చిలుకూరి(Pradeep Chilukuri) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సాయి మంజ్రేకర్(Sai Manjrekar) హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ విజయశాంతి(Vijayashanthi) కీ రోల్ ప్లే చేస్తున్నారు.
అలాగే సోహెల్ ఖాన్(Sohail Khan), శ్రీకాంత్(Srikanth) కూడా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ‘కాంతార’(Kanthara) ఫేమ్ అజనీష్ లోక్ నాథ్(Ajaneesh Loknath) సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ చిత్రం ఏప్రిల్ 18న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లోకి రిలీజ్ కాబోతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రస్తుతం ప్రమోషన్ల జోరులో ఉన్నారు మూవీ టీమ్.
ఇందులో భాగంగా తాజాగా విలేకర్స్‌తో ముచ్చటించిన కళ్యాణ్ రామ్‌ను.. బాలకృష్ణతో ఎప్పుడు నటిస్తారు అని అడుగగా.. దానికి కళ్యాణ్ రామ్ స్పందిస్తూ.. ‘పైన స్వామి వారిని అదే కోరుకుంటున్నాను. ఆయన ఎప్పుడు ఆ స్టోరీ ఇస్తారో, ఆయన ఎప్పుడు తలుచుకుంటాడో అప్పుడే జరుగుతుంది. నేను కూడా బాబాయ్‌తో నటించడం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






