అలా చేస్తే చచ్చిపోతా.. ఆ విషయంలో చిరుని బ్లాక్ మెయిల్ చేసిన చరణ్?

by Disha Web Desk 6 |
అలా చేస్తే చచ్చిపోతా.. ఆ విషయంలో చిరుని బ్లాక్ మెయిల్ చేసిన చరణ్?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు. ఇక సినిమాల కోసం ఎంతో కష్టపడుతూ ప్రస్తుతం టాప్ హీరోగా కొనసాగుతూ ఉన్నాడు. తాజాగా, రామ్ చరణ్ కు సంబంధించిన ఒక వార్త వైరల్‌గా మారింది. తండ్రి మెగాస్టార్‌ను ఒక విషయంలో రామ్ చరణ్ బ్లాక్ మెయిల్ చేశాడట. చరణ్ సినిమాల్లోకి రాకముందు నుంచే చిరంజీవి చరణ్ ఫిట్నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాడట.

ఈ క్రమంలోనే శ్రీహరి వద్దకు ఫిట్నెస్ కోసం చరణ్ పంపించాడట చిరంజీవి. కానీ రెండు రోజులు కూడా శ్రీహరి దగ్గర ఉండలేక.. చెర్రీ తిరిగి ఇంటికి వచ్చేశాడట. శ్రీహరి ఆయన అంత కఠినంగా వర్కౌట్స్ చేపిస్తున్నారని ఏడ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మళ్లీ ఆయన దగ్గరకు పంపితే చచ్చిపోతానని బ్లాక్ మెయిల్ చేసినట్లు టాక్. అయితే రామ్ చరణ్ - శ్రీహరి ఇద్దరు కూడా మగధీర సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Next Story

Most Viewed