Jabardasth Naresh: నచ్చనివాళ్లకు ఈవెంట్ చేస్తే నా ప్రవర్తన అలాగే ఉంటుంది

by Pulgam srinivas |

జబర్దస్త్ నరేష్ నరేష్ మాట్లాడుతూ... నేను ఈవెంట్స్ చేసే సమయంలో డబ్బు గురించి పట్టించుకోను, కానీ నాకు నచ్చని వ్యక్తుల విషయంలో మాత్రం కరాఖండిగా ఉంటాను. అలాంటి వారితో డబ్బు విషయంలో వెనక్కి తగ్గను అని చెప్పుకొచ్చాడు.

Jabardasth Naresh: నచ్చనివాళ్లకు ఈవెంట్ చేస్తే నా ప్రవర్తన అలాగే ఉంటుంది
X

దిశ, వెబ్ డెస్క్: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నరేష్ ఒకరు. ఈయన తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించి చాలామంది బుల్లితెర అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈయన ఈటీవీకి సంబంధించిన షోలలో పాల్గొంటున్నాడు. జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీలో సందడి చేస్తున్నాడు. తాజాగా ఈ కమెడియన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

అందులో అనేక విషయాల గురించి తెలియజేశాడు. నరేష్ మాట్లాడుతూ... ప్రస్తుతం ఈటీవీలో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ చేస్తున్నాను. నెలకు సగటున ఎనిమిది నుండి తొమ్మిది ఈవెంట్లు చేస్తుంటాను, సంక్రాంతి లాంటి పండుగల సమయంలో దాని సంఖ్య 13 నుండి 14 వరకు పెరుగుతూ ఉంటుంది. నేను ఈవెంట్స్ చేసే సమయంలో పెద్దగా డబ్బు గురించి పట్టించుకోను, కానీ నాకు నచ్చని వ్యక్తుల విషయంలో మాత్రం కరాఖండిగా ఉంటాను.

అలాంటి వారితో డబ్బు విషయంలో వెనక్కి తగ్గను. ఈ ఇంటర్వ్యూలో మీరు ఒక్క ఈవెంట్‌కు ఎంత తీసుకుంటారు అనే ప్రశ్న ఎదురైంది. దీనికి నరేష్ స్పష్టమైన సమాధానం చెప్పలేదు. ఒక్కో ఈవెంట్‌కు 3,000-4,000 రూపాయలు మాత్రమే ఉంటుందని ఓ టాక్ ఉంది అని ఆయనను ప్రశ్నించగా అది నిజం కాదు అని అన్నారు. 50 వేల వరకు తీసుకుంటారా అని ప్రశ్నించగా 'మే బీ' అని సమాధానం ఇచ్చాడు.

Next Story