కిర్రాక్ ఆర్పీని అన్నగా భావిస్తే.. నన్ను దారుణంగా మోసం చేశాడు.. తన్మయ్ సంచలన వ్యాఖ్యలు (వీడియో)

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-07 13:50:32  IST  )

జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలు మారిన విషయం తెలిసిందే. ఈ షో వల్ల చాలామంది సినిమాల్లోనూ నటించి మెప్పిస్తున్నారు.

కిర్రాక్ ఆర్పీని అన్నగా భావిస్తే.. నన్ను దారుణంగా మోసం చేశాడు.. తన్మయ్ సంచలన వ్యాఖ్యలు (వీడియో)
X

దిశ, సినిమా: జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలు మారిన విషయం తెలిసిందే. ఈ షో వల్ల చాలామంది సినిమాల్లోనూ నటించి మెప్పిస్తున్నారు. ఇండస్ట్రీకి ఎంతో మంది నటీనటులు వచ్చారు. అలా వచ్చిన వారిలో జబర్దస్త్ లేడీ కమెడియన్ తన్మయ్(Tanmay) కూడా ఒకరు. అయితే ఆమె పలు కారణాల వల్ల షో మధ్యలోనే వెళ్లిపోయింది. తాజాగా, ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు జబర్దస్త్ షో వదిలేయడానికి కారణం ఏంటో తెలిపింది. అంతేకాకుండా తనను చాలామంది మోసం చేసినట్లు వెల్లడిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘నా జీవితంలో అందరూ మోసం చేసినవాళ్లే. ముఖ్యంగా జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీని నా లైఫ్‌లో అస్సలు మర్చిపోలేను. నేను ఆ షో మానేసి అదరింది షోకి వచ్చింది అతని వల్లే. అతన్ని ఒక టైమ్‌లో నా సొంత అన్నలాగా ట్రీట్ చేశాను. కానీ అతని మైండ్ సెట్ అంతా వేరు.

నా పర్సనల్ విషయాల్లో అతని వల్ల చాలా బాధపడ్డాను. ఒకానొక టైమ్‌లో తనకు నేను చాలా సపోర్ట్‌గా ఉన్నాను. కానీ అతని వల్లే జబర్దస్త్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. డబ్బుల పరంగా సపోర్ట్ చేశా అతను మాత్రం నాకు హెల్ప్ చేయలేదు. ఈ ప్రపంచంలో నాశనం చేసేది డబ్బు, నమ్మకం ఈ రెండే. మనకు సాయం చేశారన్న విశ్వాసం కూడా కొంత మందికి ఉండదు. నేను ఎంత చేశానన్నది కిర్రాక్ ఆర్పీ(Kirrock RP)కి తెలుసు. చాలామంది జబర్దస్త్ వాళ్లకి కూడా ఈ విషయం తెలుసు. అంతా డబ్బు మీదే నడుస్తుంది. ఒక మనిషిని బాగుపడాలన్నా.. డబ్బు నమ్మకమే.. చెడిపోవాలన్నా డబ్బు నమ్మకమే కారణం. కానీ మనం ఎంత స్ల్రగుల్ అవుతున్నది మనకు మాత్రమే తెలుసు. అందరికీ నా డబ్బు, బాడీ, ఫేమ్ మాత్రమే కావాలి. అయితే ఇటీవల నేను సూసైడ్ చేసుకోవాలని కూడా అనుకున్నాను. మొత్తానికి విసిగిపోయాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Click For Tweet..

Next Story