Allu Arjun:‘చిరంజీవిని నేను ఆ పేరుతో పిలుస్తా’.. అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Jakkula.Mamatha |   (  Updated:2025-08-03 15:35:24  IST  )

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon star Allu Arjun) మరోసారి బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ షోకి హాజరయ్యారు.

Allu Arjun:‘చిరంజీవిని నేను ఆ పేరుతో పిలుస్తా’.. అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ,వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon star Allu Arjun) మరోసారి బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ షోకి హాజరయ్యారు. ప్రస్తుతం ఆహా వేదికగా నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్’ షో(Unstoppable show) దూసుకుపోతుంది. ఇప్ప‌టికే విజ‌య‌వంతంగా మూడు సీజ‌న్లు పూర్తి చేసుకుంది. ప్ర‌జెంట్ నాలుగో సీజ‌న్ స‌క్సెస్ ఫుల్‌గా న‌డుస్తోంది. అయితే పుష్ప 2 సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ టాక్‌ షోలో పాల్గొన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బన్నీ చిరంజీవి గారిని ఉద్దేశిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మెగాస్టార్ చిరంజీవితో తన చిన్ననాటి అనుభవాలను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పంచుకున్నారు. ఆన్‌స్టాపబుల్ షోలో గెస్టుగా వచ్చిన ఆయన చిరుకు తాను చిన్నప్పటి నుంచే ఫ్యాన్ అని తెలిపారు. చిరంజీవి అంటే నాకిష్టమని అందరికీ తెలుసు అన్నారు. కానీ.. నా బాల్యంలోనే ఆయన వ్యక్తిత్వానికి నేను ఫ్యాన్ అయ్యాను. నా చిన్నప్పుడే ఆయన నన్ను& తమ్ముడిని ఫారిన్‌కి తీసుకెళ్లారు. మేము ఆయనను ‘చిక్కు బాబాయ్’ అని పిలుస్తాం అని అల్లు అర్జున్ వెల్లడించారు.

Next Story