ఆసక్తికరంగా ఐడెంటిటీ తెలుగు ట్రైలర్..

by sudharani |
ఆసక్తికరంగా ఐడెంటిటీ తెలుగు ట్రైలర్..
X

దిశ, సినిమా: టోవినో థామస్ (Tovino Thomas), త్రిష (Trisha) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఐడెంటిటీ’ (Identity). అఖిల్ పాల్, అనాస్ ఖాన్ రచన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి రాజు మల్లియాత్, రాయ్ సిజె నిర్మాతలుగా వ్యవహరించారు. వినయ్ రాయ్, మందిర బేడి తదితరులు కీలకపాత్ర పోషించి ‘ఐడెంటిటీ’ మూవీ రీసెంట్‌గా మలయాళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద కేవలం రెండు వారాలలో రూ. 50 కోట్లకు పైగా వసూలు రాబట్టి 2025 లో తొలి హిట్ సినిమాగా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని మూవీ మాక్స్ శ్రీనివాస్ మామిడాల సమర్పణలో శ్రీ వేదాక్షర మూవీస్ చింతపల్లి రామారావు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నెల 24వ తేదిన తెలుగులో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన తాజాగా తెలుగు ట్రైలర్ (Trailer) విడుదల చేశారు చిత్ర బృందం.

ఈ సందర్భంగా నటుడు వినయ్ రాయ్ (Vinay Roy) మాట్లాడుతూ.. ‘నా 18 సంవత్సరాల కెరియర్‌లో ఇటువంటి కథను నేను ఎప్పుడు వినలేదు. ఈ చిత్రంలో యాక్షన్, సస్పెన్స్, మంచి స్టోరీ లైన్ ఇలా అన్నీ ఉన్నాయి. ఈ చిత్రం తెలుగువారికి ఎంతో నచ్చుతుందని అనుకుంటున్నాను. తెలుగు నిర్మాతలకు ఈ చిత్రం మంచి బిజినెస్ చేస్తుందని అనుకుంటున్నాను. జనవరి 24వ తేదీన ఈ చట్టం ప్రేక్షకులు ముందుకు రాబోతుంది’ అని తెలిపారు.

చింతపల్లి రామారావు (Chintapalli Rama Rao) మాట్లాడుతూ.. ‘మామిడాల శ్రీనివాసరావుతో కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నాము. ఇది మలయాళ చిత్రం అయినప్పటికీ ఇందులో నటించిన వారు అలాగే ఈ సినిమాకు పనిచేసినవారు తెలుగునాట అందరికీ సుపరిచితులు కావడం విశేషం. ఈ చిత్రం ద్వారా దర్శకులకు తెలుగులో మంచి గుర్తింపు వస్తుందని కోరుకుంటున్నాము. జనవరి 24వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతన్న ఈ చిత్రం అందరిని వినోదపరుస్తుందని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed