- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆదర్శ కుటుంబం AK-47’.. స్టేషన్‌లో హై వోల్టేజ్ యాక్షన్
'ఆదర్శ కుటుంబం AK 47' మూవీ బృందం ఇటీవల మలక్‌పేట్ మెట్రో స్టేషన్‌లో కీలక యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆఖరుగా ‘గుంటూరు కారం’ చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఆ సినిమా విడుదలై చాలా కాలం గడిచింది. ప్రస్తుతం ఆయన విక్టరీ వెంకటేష్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం ఏకే 47’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ ఏడాది అక్టోబర్ నెలలో లేదా దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మూవీ బృందం భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించిన తాజా షూటింగ్ అప్డేట్ ఒకటి వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవల మలక్‌పేట్ మెట్రో స్టేషన్‌లో ఈ చిత్రానికి సంబంధించిన కీలక యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. రైల్వే స్టేషన్ నేపథ్యంలో చిత్రీకరించిన ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్‌గా నిలవనున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక శైలిలో ఈ సన్నివేశాన్ని త్రివిక్రమ్ తెరకెక్కించినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని కామెడీ ప్లస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. మొదట ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా హర్షవర్ధన్ రామేశ్వర్‌ను ఎంపిక చేసినప్పటికీ, ప్రస్తుతం ఆయన స్థానంలో ఎస్.ఎస్. తమన్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.






