Allu Arjun: ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ న్యూ లుక్ వైరల్.. చూస్తే మతిపోవాల్సిందే?

by Kodari Anjali |

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్(Pan India star Allu Arjun) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Allu Arjun: ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ న్యూ లుక్ వైరల్.. చూస్తే మతిపోవాల్సిందే?
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్(Pan India star Allu Arjun) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ప్రముఖ నిర్మాత అరవింద్(Producer Aravind) కుమారుడు.. హాస్య నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) మనవడుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు బన్నీ. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌(Power Star Pawan Kalyan)కు మేనల్లుడు అయిన అల్లు అర్జున్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడైన కె. రాఘవేంద్రరావు (Raghavendra Rao) దర్శకత్వంలో గంగోత్రి(Gangotri) సినిమాలో నటించి.. మొదటి చిత్రంతోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాడు. తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ మూవీలో ఓ స్పెషల్ రోల్‌లో నటించి ప్రేక్షకుల్ని ఆకర్షించాడు. తర్వాత బన్నీ వరుస చిత్రాలతో దూసుకుపోయాడు. కొన్నిసార్లు పరాజయం ఎదురైన కూడా అల్లు అర్జున్ వెనకడుగు వేయలేదు.

ఆర్య, బన్ని, హ్యాపీ(happy), దేశముదురు, శంకర్‌దాదా జిందాబాద్(అతిథి పాత్రలో), పరుగు, ఆర్య-2, బద్రీనాథ్(Badrinath), వరుడు, జులాయి, ఇద్దరమ్మాయిలతో, రేసుగుర్రం, రుద్రమదేవి(Rudramadevi), దువ్వాడ జగన్నాధం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, అల వైకుంఠపురంలో, పుష్ప రెండు పార్టుల్లో నటించి అల్లు అర్జున్ మంచి పేరు దక్కించుకున్నాడు. ఈ హీరోకు పుష్క చిత్రంలో అద్భుతమైన నటనకు నేషనల్ అవార్డు(National Award) కూడా వచ్చింది. ప్రస్తుతం అల్లు అర్జున్ రేంజ్ వేరే లెవల్ అని చెప్పుకోవచ్చు. పుష్ప చిత్రంతో బన్నీ క్రేజ్ మారిపోయింది. అయితే అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా బన్నీ న్యూ లుక్ వైరల్ అవుతోంది. ఈ పిక్స్ వీక్షించిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Next Story