- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అల్లు అర్జున్ ఖాతాలో మరో ఘనత.. షాక్ అవుతున్న సినీ వర్గాలు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఖాతాలో మరో అరుదైన ఘనత చేరింది..

దిశ, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon star Allu Arjun) ఖాతాలో మరో అరుదైన ఘనత చేరింది. ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ మ్యాగజైన్ కవర్ పేజీపై ఆయనకు స్థానం దక్కింది. ‘పుష్పా-2’ చిత్రం('Pushpa-2' Movie) సృష్టించిన రికార్డుల గురించి రాస్తూ ఇలా కవర్ పేజీపై అల్లు అర్జున్ ఫొటోను ప్రింట్ చేశారు. దీంతో సినీ వర్గాలు షాక్‌కు గురవుతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమంటూ కితాబిస్తున్నారు.
అయితే ఈ మ్యాగజైన్ చేసిన ఇంటర్వూలో అల్లు అర్జున్ తనకు తాను 5.5 రేటింగ్ ఇచ్చుకోవడం విశేషం. అయితే ఈ మేగజైన్ ఇండియాలో త్వరలో విడుదల కానుంది. అయితే ఈ మేగజైన్ చేసిన ఇంటర్వూలో అల్లు అర్జున్ పంచుకున్న విశేషాలను తెలుసుకోవాలని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
కాగా అల్లు అర్జున్ నటించిన పుష్పా-2 మూవీ భారీగా కలెక్షన్లు రాబట్టింది. తెలుగుతో పాటు పాన్ ఇండియా రేంజ్‌లో ఈ మూవీని విడుదల చేశారు. చిత్రంలో వైవిధ్యమైన సన్నివేశాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.1871 కోట్లు వచ్చాయి. ఈ మూవీ దేశంలోనే అత్యధికంగా వసూళ్లు రాబట్టిన రెండోదిగా నిలిచింది. ఈ మేరకు అల్లు అర్జున్ తో సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, అట్లీ దర్శకత్వంలో వస్తున్న రెండు మూవీల్లో అల్లు అర్జున్ నటించబోతున్నారు.






