- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐబొమ్మ రవి వెనక ఆ ఇద్దరు వ్యక్తులు.. వెలుగులోకి కీలక విషయాలు
ఐబొమ్మ రవిని మూడోసారి సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. 12 రోజుల పాటు రవిని విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: ఐబొమ్మ రవిని మూడోసారి సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. 12 రోజుల పాటు రవిని విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో చంచల్ గూడ జైలులో రవిని కస్టడీలోకి తీసుకుని విచారించగా మరికొన్ని కీలక విషయాలను రవి వెల్లడించాడు. హెచ్ డీ సినిమాలను ఎలా పైరసీ చేస్తారని పోలీసులు ప్రశ్నించగా పూర్తి వివరాలు చెప్పినట్టు తెలుస్తోంది. అదే విధంగా ఈ విచారణలో మరో ఇద్దరు కొత్త వ్యక్తుల పేర్లు బయటపెట్టినట్టు సమాచారం. సినిమాల పైరసీలో వారు కీలకంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక అందులో ఒక పేరు ప్రహ్లాద్ కాగా మరొక పేరు ప్రసాద్. అయితే వీరిలో ప్రసాద్ ఎవరు అని ప్రశ్నించగా తన పదోతరగతి స్నేహితుడు అంటూ రవి సమాాధానం ఇచ్చాడు. కానీ ప్రహ్లాద్ గురించి అడిగితే రవి ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. రవి కరీబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ దేశ పౌరసత్వం తీసుకోగా అది ప్రహ్లాద్ పేరు పైనే ఉండటంతో ఈ కేసులో అతడు కీలకంగా మారే అవకాశం ఉంది. అంతే కాకుండా ఐబొమ్మ వెబ్ సైట్ కూడా ప్రహ్లాద్ పేరుతోనే రిజిస్ట్రేషన్ చేయించాడు కానీ అతడి వివరాలు అడిగితే మాత్రం రవి నోరు విప్పడంలేదు. దీంతో ప్రహ్లాద్ ఎవరు అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.






