అలాంటి సినిమాలంటే వెంటనే ఓకే చెప్పేస్తా.. కానీ.. సాయి ధరమ్ తేజ్ బ్యూటీ ఆసక్తికర కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-01-29 07:39:17  IST  )

‘ఊహలు గుసగుసలాడే’(Oohalu Gusagusalade) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా(Rashi Khanna) మనందరికీ సుపరిచితమే.

అలాంటి సినిమాలంటే వెంటనే ఓకే చెప్పేస్తా.. కానీ.. సాయి ధరమ్ తేజ్ బ్యూటీ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: ‘ఊహలు గుసగుసలాడే’(Oohalu Gusagusalade) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా(Rashi Khanna) మనందరికీ సుపరిచితమే. తన ఫస్ట్ మూవీతోనే ఈ బ్యూటీ యూత్ క్రష్‌గా మారిపోయింది. తన అందం, అభినయంతో కుర్రాళ్లను ఫిదా చేసింది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘జోరు’(Joru), ‘జిల్’(Jill), ‘బెంగాల్ టైగర్’(Bengal Tiger), ‘శివం’(Shivam), ‘సుప్రీమ్’(Supreme), ‘హైపర్’(Hyper), ‘జై లవకుశ’(Jai Lava Kusa), ‘రాజా ది గ్రేట్’(Raja The Great), ‘ఆక్సిజన్’(Oxigen), ‘టచ్ చేసి చూడు’(Touch chesi Chudu), ‘తొలిప్రేమ’(Tholi Prema), ‘ప్రతి రోజు పండగే’(Prati Roju Pandage), ‘వెంకీ మామ’(Venky Mama), ‘వరల్డ్ ఫేమస్ లవర్’(world Famous Lover), ‘పక్కా కమర్షియల్’(Pakka Commercial), ‘తిరు’(Thiru) వంటి సినిమాల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నది.

కానీ ఈ అమ్మడుకు ప్రజెంట్ తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదు. దీంతో బాలీవుడ్‌(Bollywood)కి చెక్కేసి అక్కడ ఇటీవలే ఓ వెబ్ సిరీస్ చేసింది. అలాగే ఐటెం సాంగ్స్‌లో చిందులేస్తూ ఉంది ఈ బ్యూటీ. ప్రస్తుతం సినిమాలనే కాకుండా వెబ్ సిరీస్‌లోనూ నటిస్తూ మెప్పిస్తోంది ఈ అమ్మడు. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన గ్లామర్‌తో హీట్ పుట్టించడంతో పాటు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ సినిమాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘‘నాకు కమర్షియల్ సినిమాలంటే చాలా ఇష్టం. కమర్షియల్ చిత్రాలకు వెంటనే ఓకే చెప్పేస్తా.. కానీ అలాంటి సినిమాలు చేయడానికి ఇంకా చాలా సమయం ఉంది. అలాంటి ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. నేను నటిగా ఎదగాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నా..

మంచి కంటెంట్‌ ఉన్న సినిమాల్లో అవకాశం వస్తే ఆ సినిమానే మన ఎదుగుదలకు కారణం అవుతుంది. నటిగా నన్ను నేను నిరూపించుకోవడానికి మరో అవకాశం దక్కుతుంది. అలాంటి చిత్రాలు ఎక్కువగా చేయాలని కోరుకుంటున్నా. చాలా కాలంగా సౌత్‌లో సినిమాలు చేస్తున్నా.. కానీ అలాంటి చిత్రాలే హిందీలో చేస్తే ఎలాంటి ఎగ్జైయిట్‌మెంట్‌ ఉండదు’ అని రాశిఖన్నా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story