చాలా కష్టపడి ఆ సినిమాను పూర్తి చేశాను.. ఆసక్తికర విషయాలు చెప్పిన కృష్ణవంశీ!

by Pulgam srinivas |

'మొగుడు' సినిమా నా కెరీర్‌లో అత్యంత బాధాకరమైన అనుభవం అని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు.

చాలా కష్టపడి ఆ సినిమాను పూర్తి చేశాను.. ఆసక్తికర విషయాలు చెప్పిన కృష్ణవంశీ!
X

దిశ, వెబ్ డెస్క్: క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమర్షియల్ ఫార్ములాకు దూరంగా ఉంటూ, వైవిధ్యమైన కథాంశాలతో ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ఆయన, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న అత్యంత కఠిన అనుభవాన్ని కృష్ణవంశీ పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు నేను ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించాను. వాటిలో కొన్ని విజయాలు సాధించాయి, మరికొన్ని ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

అయితే 'మొగుడు' సినిమా విషయంలో మాత్రం నేను తీవ్రంగా ఇబ్బందులు పడ్డాను. ఆ చిత్రాన్ని ఎంతో ఉత్సాహంగా ప్రారంభించాను. కానీ ఆ తర్వాత కొంతమంది నన్ను మోసం చేశారు. దాంతో ఆ సినిమా చేయాలనే ఆసక్తి కూడా పూర్తిగా పోయింది. ఎంతో బాధతో ఆ చిత్రాన్ని పూర్తి చేశాను. షూటింగ్ జరిగిన కొన్ని నెలల పాటు 'ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది? దీని నుంచి ఎప్పుడు బయటపడతానా?' అనే వేదనతోనే గడిపానని తెలిపారు. ఇక 'మొగుడు' చిత్రంలో గోపీచంద్ హీరోగా, తాప్సి హీరోయిన్‌గా నటించారు. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేక ఫ్లాప్‌గా నిలిచింది.

Next Story