పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి.. సభ వాయిదా

by Naga Rani Yarlagadda |

నేడు ఉభయ సభల్లో వాయిదాల పర్వం నడుస్తోంది. సభలు ప్రారంభమవ్వగానే నీట్ పేపర్ లీక్ పై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో మధ్యాహ్నం 12 గంటలకు ఉభయ సభలు వాయిదా పడ్డాయి.

పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి.. సభ వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు ఉభయ సభల్లో వాయిదాల పర్వం నడుస్తోంది. సభలు ప్రారంభమవ్వగానే నీట్ పేపర్ లీక్ పై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో మధ్యాహ్నం 12 గంటలకు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. పునః ప్రారంభమైన అనంతరం కేంద్రమంత్రి జితేంద్రసింగ్ పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లు 2026 ను ప్రవేశపెట్టారు. పబ్లిక్ పరీక్షల్లో చోటుచేసుకునే అక్రమాలను నిరోధించేందుకు ఈ బిల్లును రూపొందించిన మంత్రి స్పీకర్ కు వివరించారు. విపక్షాల ఆందోళనల మధ్యే బిల్లును ప్రవేశపెట్టగా అన్ని పార్టీల సభ్యులు దీనిపై మాట్లాడాలని స్పీకర్ ఓం బిర్లా కోరారు. బిల్లులో సవరణలకు మధ్యాహ్నం 1 గంట వరకూ స్పీకర్ అవకాశమిచ్చారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల వరకూ లోక్ సభను వాయిదా వేశారు.

Next Story