- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణకు 4 రోజులు భారీ వర్షసూచన.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణ జిల్లాల్లో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ అంచనా వేశారు.

దిశ, వెబ్‌డెస్క్: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణ జిల్లాల్లో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ అంచనా వేశారు. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ తూర్పు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఈ నెల 30వ తేదీ వరకూ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. అలాగే రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్ధిపేట, జనగామ, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో చిరుజల్లులు పడతాయని పేర్కొన్నారు. రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో 100 నుంచి 120 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావొచ్చని తెలిపారు. ఎల్-నినో భయాల నడుమ రానున్న ఈ వర్షాలు తెలంగాణలో వ్యవసాయ పనులకు పెద్ద ఊరటనిచ్చి, గణనీయంగా పుంజుకునేలా చేయనున్నాయి.






