- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆఫర్ల కోసం రెండేళ్లు ఆ పని చేశా.. పవన్ కళ్యాణ్ బ్యూటీ ఎమోషనల్ కామెంట్స్
సవ్యసాచి(Savyasachi) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

దిశ, సినిమా: సవ్యసాచి(Savyasachi) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) సరసన ‘రాజా సాబ్’(Raja Saab) సినిమాలో నటిస్తోంది. మారుతి(Maruthi) డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 10న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సరసన ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu) సినిమాలో కూడా నటిస్తోంది.
క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాత ఏ ఎమ్ రత్నం(A.M. Ratnam) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అటు ఓ పక్కా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నప్పటికీ నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది నిధి. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది.ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి అగర్వాల్ ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
ఆమె మాట్లాడుతూ.. ‘నేను హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వకముందు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే చాలా ఇష్టం. దీంతో నా చిన్నతనం నుంచే మూవీస్ ఎక్కువగా చేసేదాన్ని. అయితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె(Deepika Padukone)ని చూశాక నేను కూడా అలా సినిమాల్లోకి రావాలనుకున్నాను, ఇదే విషయం ఇంట్లో చెబితే ఫస్ట్ చదువుకో అని అన్నారు.
ఇక చదువు పూర్తయ్యాక ముంబై వెళ్లి సినీ అవకాశాల కోసం చాలా ట్రై చేశా. నా ఫొటోస్ పట్టుకుని ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాను. చాన్స్ ఇవ్వకపోయినా నన్ను పదే పదే ఆఫీసుల చుట్టూ తిప్పుకున్నారు. అలా ఆఫర్స్ కోసం రెండేళ్లు ట్రై చేశా’ అంటూ ఎమోషనల్ అయింది నిధి అగర్వాల్. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






