ట్రెండింగ్ కోసం స్పందించను.. బండి భగీరథ్ ఇష్యూపై అనసూయ షాకింగ్ పోస్ట్!

by Mallepaka Hamsa |

ఏదైనా విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నప్పుడు వెంటనే స్పందించడం చాలా ఈజీ అని, కానీ దానివల్ల వచ్చే ఫలితాలను కూడా ఆలోచించాలని ఆమె అన్నారు.

ట్రెండింగ్ కోసం స్పందించను.. బండి భగీరథ్ ఇష్యూపై అనసూయ షాకింగ్  పోస్ట్!
X

దిశ, సినిమా: సోషల్ మీడియా సెన్సేషన్ టాలీవుడ్ నటి అనసూయ నిత్యం పలు విషయాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. కానీ ఆమె గత కొద్ది కాలంగా సైలెంట్‌గా ఉంటోంది. ఇటీవల బండి భగీరథ్ కేసు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఆయనపై నమోదైన పోక్సో కేసుపై రోజు రోజుకు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రతి విషయంపై స్పందించే అనసూయ ఈ విషయం మాత్రం స్పందించకుండా సైలెంట్‌గా ఉండటంతో నెటిజన్లు ఆమెకు మెసేజ్‌లు పెట్టారు. దీంతో అనసూయ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రియాక్ట్ అవుతూ ఎవరూ ఊహించని పోస్ట్ పెట్టింది. ఏదైనా విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నప్పుడు వెంటనే స్పందించడం చాలా ఈజీ అని, కానీ దానివల్ల వచ్చే ఫలితాలను కూడా ఆలోచించాలని ఆమె అన్నారు. నిజాలు ఏంటో అధికారికంగా బయటకు వచ్చే వరకు మనం కొంచెం ఓపికగా, బ్యాలెన్స్‌డ్‌గా ఉండటం మంచిదని సూచించారు. "నేను కూడా అందరిలాగే వార్తలు చూస్తున్నాను, కానీ నిజానిజాలు తెలియకుండా ఒకరిపై విమర్శలు చేయడం నాకు ఇష్టం లేదు" అని క్లియర్ గా చెప్పారు.

ఒకవేళ నిందితుడు తప్పు చేసి ఉంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని, శిక్ష తప్పదని ఆమె అభిప్రాయపడ్డారు. కానీ వాస్తవాలు ఏంటో తెలియకుండా మనం చేసే కామెంట్స్ వల్ల వేరే వాళ్లకు జరిగే నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తనకు పూర్తిగా నమ్మకం కలిగినప్పుడే దీనిపై మాట్లాడతానని స్పష్టం చేశారు. తను ఒక తల్లిగా, సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తిగా ఏదైనా మాట్లాడే ముందు ఆలోచిస్తానని ఆమె తెలిపారు. తన మనసుకు ఏదైనా తప్పు అనిపిస్తే అది ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా ప్రశ్నిస్తానని, కానీ అంతవరకు తనకు క్లారిటీ కావాలని కోరారు. మొత్తానికి, ట్రెండింగ్‌లో ఉంది కదా అని ఏదో ఒకటి మాట్లాడి వివాదాల్లో ఇరుక్కోవడం కంటే, నిజం తెలిసే వరకు వేచి చూడటమే ఉత్తమమని అనసూయ చెప్పిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Next Story