వంద కోట్లు ఇచ్చినా ఆయనతో నటించను.. నయనతార స్టేట్మెంట్..

by Sujitha Rachapalli |   (  Updated:2025-06-01 12:57:31  IST  )

2022లో వచ్చిన ‘ది లెజెండ్’ మూవీ సక్సెస్ సొంతం చేసుకుంది. అరుల్ శరవణన్ హీరోగా, నిర్మాతగా బాధ్యతలు తీసుకోగా.. ఊర్వశీ రౌతేలా, గీతికా తివారీ హీరోయిన్లుగా నటించారు.

వంద కోట్లు ఇచ్చినా ఆయనతో నటించను.. నయనతార స్టేట్మెంట్..
X

దిశ, ఫీచర్స్ : 2022లో వచ్చిన ‘ది లెజెండ్’ మూవీ సక్సెస్ సొంతం చేసుకుంది. అరుల్ శరవణన్ హీరోగా, నిర్మాతగా బాధ్యతలు తీసుకోగా.. ఊర్వశీ రౌతేలా, గీతికా తివారీ హీరోయిన్లుగా నటించారు. అయితే ముందుగా ఈ సినిమాలో నటించాలని మేకర్స్ లేడీ సూపర్ స్టార్ నయనతారను కలిసినట్లు సమాచారం. కాగా ఎలాంటి డిలే లేకుండా డైరెక్ట్‌గా నో చెప్పేసిందట బ్యూటీ. ‘వంద కోట్లు ఇచ్చినా ఆయనతో యాక్ట్ చేయను’ అని స్టేట్మెంట్ ఇవ్వడంతో అప్పట్లో వైరల్ అయింది. ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలో హీరోయిన్ దీపికా పదుకొణే, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మధ్య వార్ నడుస్తుండటంతో.. నయన్ స్టేట్మెంట్ తెరమీదకు వచ్చింది.

కాగా ఈ విషయంపై స్పందిస్తున్న అభిమానులు.. ఎవరి ఒపీనియన్ వారిదని కొందరు నయన్‌కు మద్దతిస్తున్నారు. కానీ నెటిజన్లు మాత్రం ట్రోల్ చేస్తున్నారు. అడల్ట్ సినిమాల్లో నటించిన రోజులు మరిచిపోయినట్లుందని.. ఒకప్పుడు చిన్న హీరోలా సినిమాల్లోనే చేసిందని, సైడ్ క్యారెక్టర్స్ చేసిన విషయం గుర్తుంచుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. వంద కోట్లు ఇచ్చినా ఆ సినిమాలో యాక్ట్ చేయనని చెప్పింది కానీ అంత పెద్ద మొత్తంలో ఇస్తే కచ్చితంగా నటించేదని.. అయినా వంద కోట్లు ఇచ్చాక ఆమె ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

Next Story