Pawan Kalyan: ఇది జీవితాంతం గుర్తుపెట్టుకుంటా.. పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్తూ తమన్ ఎమోషనల్ ట్వీట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-02-17 09:17:48  IST  )

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman)వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

Pawan Kalyan: ఇది జీవితాంతం గుర్తుపెట్టుకుంటా.. పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్తూ తమన్ ఎమోషనల్ ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman)వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇటీవల ఆయన మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించిన ‘డాకు మహారాజ్’(Daaku Maharaj) మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అలాగే భారీ కలెక్షన్లు రాబట్టింది. బాబీ కొల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), శ్రద్ధా శ్రీనాథ్(Shraddha Srinath) హీరోయిన్లుగా నటించగా.. సంక్రాంతి కానుకగా వచ్చి సూపర్ హిట్ అందుకుంది. దీంతో ఇటీవల బాలయ్య, తమన్‌కు కారును బహుమతిగా ఇచ్చారు. అయితే తమన్ వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు.

తాజాగా, ఆయన ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘‘ఈవెంట్‌ను జీవితాంతం మర్చిపోలేను. ఇలాంటి గొప్ప అవకాశాన్ని కల్పించిన నారా భువనేశ్వరి మేడమ్’కు, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్( Pawan Kalyan), బాలకృష్ణ(Balakrishna), లోకేష్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యమైన వ్యక్తుల ముందు ఫెర్ఫార్మెన్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. మన ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఈవెంట్‌ను బ్లాక్ బస్టర్ చేసినందుకు ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చారు. అలాగే ఓ ఎమోషనల్ వీడియోను షేర్ చేశాడు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ‘యూఫోరియా మ్యూజికల్ నైట్’ ఈవెంట్ గురించి తమన్ ఎమోషనల్ అయినట్లు సమాచారం.


Next Story