నా పరువు తీసేందుకు ప్రయత్నిస్తే ఎంతవరకైనా వెళ్తాను.. డైరెక్టర్‌కు యంగ్ హీరోయిన్ వార్నింగ్ (పోస్ట్)

by Mallepaka Hamsa |

మలయాళ నటి అనస్వర రాజన్(Anaswara Rajan)... పలు ఓటీటీ చిత్రాలతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది.

నా పరువు తీసేందుకు ప్రయత్నిస్తే ఎంతవరకైనా వెళ్తాను.. డైరెక్టర్‌కు యంగ్ హీరోయిన్ వార్నింగ్ (పోస్ట్)
X

దిశ, సినిమా: మలయాళ నటి అనస్వర రాజన్(Anaswara Rajan)... పలు ఓటీటీ చిత్రాలతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. 15 ఏళ్లు ఉన్నప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన ఆమె అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుని హీరోయిన్‌గా రాణిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘మిస్టర్ అండ్ మిసెస్ బ్యాచిలర్’(Mr. and Mrs. Bachelor) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇంద్రజిత్ సుకుమారన్ (Indrajith Sukumaran)హీరోగా నటిస్తుండగా.. దీపు కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ టీమ్ అంతా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో.. డైరెక్టర్ అనస్వర రాజన్‌పై పలు ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా, ఈ విషయంపై స్పందిస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. ‘‘ఈ సినిమా కోసం ఇచ్చిన ఒకే ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ నాదే. నేను పలు పోస్టర్స్‌ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాను. అయితే రిలీజ్ డేట్ మార్పు గురించి నాకు అస్సలు సమాచారం ఇవ్వలేదు. కానీ ప్రమోషన్స్‌కు సహకరించట్లే అని అంటున్నారు. నాపై ఇలాంటి ఆరోపణలు చేస్తూ పరువు తీసేందుకు ప్రయత్నిస్తే మాత్రం ఎంతవరకైనా వెళ్తాను. ఇప్పటికే మాలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో అతని ఫిర్యాదు కూడా చేశాను’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం అనస్వర పోస్ట్ మలయాళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story