తక్కువ బడ్జెట్‌తో వస్తున్న చిత్రాలకు నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

by Mallepaka Hamsa |

శ్రీహర్ష, కషిక కపూర్(Kashika Kapoor) జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎల్ వై ఎఫ్’(LYF).

తక్కువ బడ్జెట్‌తో వస్తున్న చిత్రాలకు నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
X

దిశ, సినిమా: శ్రీహర్ష, కషిక కపూర్(Kashika Kapoor) జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎల్ వై ఎఫ్’(LYF). ఈ సినిమాను మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నపరెడ్డి స్టూడియోస్ బ్యానర్లపై కిషోర్ రాటి, మహేష్ రాటి, ఏ రామస్వామి రెడ్డి(Ramaswamy Reddy) నిర్మిస్తున్నారు. పవన్ కేతరాజు(Pawan Ketharaju) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ఎస్పీ చరణ్, ప్రవీణ్, భద్రం, నవాబ్ షా, షకలక శంకర్, రవి బాబు(Ravi Babu), రియా, సంధ్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన టీజర్ తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkata Reddy) చేతుల మీదుగా విడుదల అయింది. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ‘‘శ్రీహర్ష, కషిక కపూర్ యువ జంటగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ‘ఎల్ వై ఎఫ్’. మంచి కథతో వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయాన్ని సాధించాలి అని కోరుకుంటున్నాను. తీసే సినిమాలు ఎక్కువ బడ్జెట్లో కాకుండా మంచి కంటెంట్‌తో తక్కువ బడ్జెట్‌తో ఉంటే సినిమాలు బాగుంటాయి.

ఎక్కువ డబ్బులు పెట్టి తర్వాత టికెట్ రేట్లు పెంచాలని ప్రభుత్వాన్ని అడగడం కంటే తక్కువ పెట్టి మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం మంచిది. ఈ ‘ఎల్ వై ఎఫ్’ అనే మూవీ అలా తక్కువ బడ్జెట్లో మంచి కంటెంట్ తో వస్తుంది. ఇటువంటి చిత్రాలను ప్రోత్సహించడంలో సినిమాటోగ్రఫీ మినిస్టర్‌గా నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను. ఓటీటీలో అయినా థియేటర్ లో అయినా తక్కువ బడ్జెట్ తో వచ్చే చిన్న సినిమాలు మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. కొత్త చిత్రాలతో పోటీపడుతూ కలెక్షన్స్ వసూలు చేస్తున్నాయి. ఈ మూవీ కూడా అదే విధంగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

Next Story