ఎంతోమంది తెలుగు హీరోలతో నటించింది.. కానీ ఆ ఒక్కరికే లిప్ లాక్ ఇస్తానంటున్న తమన్నా

by Pulgam srinivas |

సమంత షోలో తమన్నా మాట్లాడుతూ... టాలీవుడ్ హీరోల్లో విజయ్ దేవరకొండకు మాత్రమే లిప్ లాక్ ఇస్తాను అని చెప్పుకొచ్చింది.

ఎంతోమంది తెలుగు హీరోలతో నటించింది.. కానీ ఆ ఒక్కరికే లిప్ లాక్ ఇస్తానంటున్న తమన్నా
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపును అత్యంత తక్కువ సమయంలో సంపాదించుకున్న వారిలో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. ఈ నటి శ్రీ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి, ఆ తర్వాత హ్యాపీ డేస్ తో బ్లాక్ బాస్టర్ను అందుకొని మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలను దక్కించుకున్న ఈ బ్యూటీ చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత ఈ సీనియర్ హీరోయిన్ అనేక ఇతర భాషల సినిమాల్లో కూడా నటించి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది.

ఇప్పటివరకు తమన్నా ఎన్నో తెలుగు సినిమాల్లో నటించింది, ఎంతోమంది స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ ఇప్పటివరకు ఎవరికీ కూడా ఈమె లిప్ లాక్ ఇవ్వలేదు. కొంతకాలం క్రితం ఈమె సమంత హోస్ట్ చేసిన ఓ షోకి గెస్ట్ గా వచ్చింది. అందులో ఈమె కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేసింది. తాజాగా తమన్నా మాట్లాడుతూ... "నేను తెలుగు హీరోల్లో లిప్ లాక్ సన్నివేశం చేయాల్సి వస్తే ఒకే ఒక్క హీరోతో చేస్తాను, ఆయన మరెవరో కాదు విజయ్ దేవరకొండ" అని సమాధానం ఇచ్చింది.

ఇప్పటివరకు మిల్కీ బ్యూటీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అనేకమంది స్టార్, మీడియం, చిన్న హీరోలతో నటించింది, కానీ విజయ్ దేవరకొండతో మాత్రం నటించలేదు. ఒకవేళ తెలుగు హీరోల్లో ఎవరికైనా లిప్ లాక్ ఇవ్వాల్సి వస్తే విజయ్ కి మాత్రమే ఇస్తాను అని చెప్పడంతో వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే అందులో లిప్ లాక్ సన్నివేశం ఉండే అవకాశాలు ఉన్నాయి అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

Next Story